Rajahmundry: రాజమండ్రిలో రోడ్డు మధ్యలో భారీ గుంత.! పైపు లైను పగలడంతో కుంగిన రోడ్డు.

ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారాయి. గుంతల రోడ్లతో నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గుంతల రోడ్లతో వాహనదారులు ప్రామాదాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న గుంటలు చాలవన్నట్టు కొత్తగా వేసిన రోడ్లు కూడా కొన్ని రోజులకే కుంగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.

Rajahmundry: రాజమండ్రిలో రోడ్డు మధ్యలో భారీ గుంత.! పైపు లైను పగలడంతో కుంగిన రోడ్డు.

|

Updated on: Dec 14, 2023 | 9:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారాయి. గుంతల రోడ్లతో నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గుంతల రోడ్లతో వాహనదారులు ప్రామాదాలబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న గుంటలు చాలవన్నట్టు కొత్తగా వేసిన రోడ్లు కూడా కొన్ని రోజులకే కుంగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరపాలక పరిధి గోరక్షణ పేటలో రోడ్డుకు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాలు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

రోడ్డు కింద భాగంలో పైప్ లైన్లు పగిలిపోవడంతో సుమారు 15 అడుగుల పొడవున భారీ గుంత పడింది. గతంలో కూడా ఓసారి ఇలాగే జరగడంతో మరమ్మతులు చేసి కొత్తగా రోడ్డు వేశారు. ఇప్పడు మళ్లీ అదే రోడ్డు కుంగిపోయింది. ఈ మార్గంలోనే ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి కాకినాడ, తుని, విశాఖపట్నం, విజయవాడ వెళ్లే బస్సులతోపాటు పెద్ద సంఖ్యలో ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం ఈ బస్సులను దారి మళ్ళించారు. రోడ్డుకి మధ్యలో బ్యారికేడ్లు పెట్టడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.. ఇప్పటికైనా ప్రధాన రోడ్లు చొచ్చుకుపోకుండా నగరపాలక సిబ్బంది నాణ్యమైన రోడ్లు వేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం రోడ్డు పైపులైను పాడైపోవడంతో మరమ్మతులు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో