Andhra: డొక్కల గూడులో ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటా అని చూడగా
ఓ వ్యక్తీకి డొక్కల గూడులో ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటా అని కొంచెం కదిపి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. అందులో ఉన్నది చూడగానే పరుగులు పెట్టాడు. ఈ ఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారీ నాగుపాము హల్చల్ చేసింది. స్థానిక కొమానపల్లి గ్రామంలోని ఒక ఇంటి డొక్కల గూడులో ఆరు అడుగుల భారీ నాగుపాము దూరింది. కావూరి చంటమ్మ అనే వ్యక్తి ఇంటి వద్ద భారీ నాగుపామును చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అతడు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని నాగుపామును చాకచక్యంగా బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో ఆ ఇంటి యజమాని, స్థానికులు హమ్మయ్య.! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పాముల సంచారం పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపిస్తే తనకు సమాచారం అందించాలని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ కోరాడు.
Published on: Sep 22, 2025 08:23 AM
వైరల్ వీడియోలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

