50% తక్కువ ధరకే రైల్వే టిక్కెట్లా ?? రైల్వే మంత్రి మాటల్లో వాస్తవమేంటి ??

|

Dec 09, 2024 | 9:52 PM

భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణికులకు మొత్తం 56వేల993 కోట్ల రూపాయిల సబ్సిడీని అందజేస్తున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి టికెట్‌పై రైల్వే దాదాపు 46 శాతం రాయితీ ఇస్తోందని తెలిపారు.

రైల్వే టిక్కెట్లలో తగ్గింపుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా, అశ్విని వైష్ణవ్ సభలో మాట్లాడుతూ, భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం అన్ని వర్గాల ప్రయాణీకులకు మొత్తం 56వేల993 కోట్ల సబ్సిడీని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ప్రతి టికెట్‌పై 46 శాతం తగ్గింపు ఇస్తారు. టికెట్ ధర 100 రూపాయిలైతే రైల్వే శాఖ మాత్రం 54 రూపాయిలు మాత్రమే వసూలు చేస్తుందన్నారు. అంటే ప్రయాణీకుడికి 46 శాతం తగ్గింపు లభిస్తుందని స్పష్టం చేశారు. వేగవంతమైన రైలు సేవలకు సంబంధించిన మరో ప్రశ్నకు అశ్వని వైష్ణవ్ స్పందిస్తూ, రైల్వే ఇప్పటికే భుజ్ – అహ్మదాబాద్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైల్ సేవను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. నమో భారత్ ర్యాపిడ్ రైలు భుజ్ – అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లో అధిగమించడం ద్వారా ఇంటర్‌సిటీ కనెక్టివిటీని మెరుగుపరిచిందని రైల్వే మంత్రి తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేరెంట్స్‌ని పెళ్లి రోజే ఖతం చేసి.. కథలు అల్లాడు

ఓటీటీలు ప్రతీనెల డబ్బులు కట్‌ చేస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి !!

వరదలో వినోదం.. మనవళ్లతో కలిసి తాత ఎంజాయ్ !!

చికెన్‌ 65.. వరల్డ్‌ వంటకాల్లో థర్డ్‌ ప్లేస్‌

రూ.50 కే వేడి వేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇదీ సీన్ !!