Andhra: బీడు భూమిలో ఏదో వింత చప్పుళ్లు.. ఏంటా అని రైతు వెళ్లి చూడగా

కర్నూలు జిల్లాలోని ఓ బైలు భూమిలో ఏదో అలజడి వినిపించింది. ఏంటా అని ఆ రైతు అక్కడికి వెళ్లి చూడగా.. ఆ ప్రాంతంలో కనిపించిన దృశ్యానికి దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే తమ ఫోన్లు తీసుకుని స్థానికులు ఈ దృశ్యాన్ని బంధించారు. ఆ వివరాలు..

Edited By:

Updated on: Jul 01, 2025 | 4:25 PM

రెండు పాములు పెనవేసుకుని.. సుమారు అర్ధగంటసేపు సందడి చేశాయి. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ ఫోన్లకు పని చెప్పి.. సోషల్ మీడియాలో ఆ వీడియోలను వైరల్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా కాస్త అలజడి వస్తే చాలు.. పాములు ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లిపోతాయి. కానీ ఇక్కడ అలా జరగలేదు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల మండలం బ్రహ్మలపల్లె గ్రామంలో రెండు నాగుపాముల సయ్యాట దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌గా మారాయి. బ్రహ్మణపల్లెలోని ఓ రైతుకు చెందిన బీడు భూమిలో రెండు నాగుపాములు సయ్యాట ఆడటం.. గ్రామస్థులు గమనించారు. దూరం నుంచి పాముల సయ్యాట చూస్తూ ఉన్న గ్రామస్థులలో ఓ వ్యక్తి తన సెల్ ఫోన్‌లో సయ్యాట దృశ్యాలను చిత్రీకరించారు. రెండు నాగుపాములు దాదాపుగా అర్థగంట సేపు సయ్యాట అడాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..