Telangana: ఊరి చివర మామిడితోటలో ఏవో వింత చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా.. అమ్మబాబోయ్
పెద్దమందడి మండలం చిక్కటంపల్లి గ్రామంలోని రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి మామిడి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువను స్థానిక కూలీలు చూశారు. వెంటనే భయాందోళనకు గురై.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. అదేంటంటే
సరీసృపాలలో భారీ కాయంతో, అలాగే అత్యంత పొడవుగా పెరిగేవి కొండచిలువలు. ఇవి అమాంతం మనుషులను సైతం మింగేస్తాయి. అలాంటి కొండచిలువలను దూరం నుంచి చూస్తేనే దెబ్బకు దడుసుకుంటాం. సరిగ్గా ఆ తరహ ఓ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిక్కటంపల్లి గ్రామంలోని ఓ మామిడితోటలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. స్థానిక మామిడితోటలో పని చేస్తోన్న కూలీలు.. ఆ కొండచిలువను చూసి దెబ్బకు షాక్ అయ్యారు. విషయాన్ని వెంటనే తోట యజమాని రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి తెలిపారు. అతడు స్నేక్ క్యాచర్, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాడు. సుమారు 15 అడుగులు, 30 కేజీల బరువున్న ఆ కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని.. ఆ తర్వాత సమీపంలోని అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు అధికారులు. కాగా, స్థానికంగా ఎవరికైనా పాములు, వన్య ప్రాణులు కనిపిస్తే.. వాటికి దూరంగా జరిగి.. వెంటనే తమకు సమాచారం అందించాలని స్నేక్ సొసైటీ సభ్యులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

