Telangana: రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు.. బ్యాగులు చెక్ చేయగా

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను విచారించగా.. పోలీసులకు అసలు విషయం బయటపడింది. ఇంతకీ ఆ సంగతి ఏంటి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Telangana: రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు.. బ్యాగులు చెక్ చేయగా

|

Updated on: Jul 31, 2024 | 6:09 PM

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో నలుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసుల అరెస్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీపీ భాస్కర్ వివరాలను వెల్లడించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను విచారించగా 1100 గ్రాముల గంజాయి లభించిందని డీసీపీ తెలిపారు. మహారాష్ట్రలోని బల్లర్ష, నాగపూర్, చంద్రపూర్ ప్రాంతాల నుంచి గంజాయి దిగుమతి చేస్తున్నారని చెప్పారు. మంచిర్యాలకు చెందిన భూక్యా సారయ్య, అల్మేకర్ శ్యామ్, వెంకటేష్ చెడు అలవాట్లు, జల్సాలకు అలవాటుపడి డబ్బులు సరిపోకపోవడంతో మహారాష్ట్ర బల్లార్షలో పాన్ షాప్ నడుపుతున్న ఎస్.కె రిజ్వాన్ వద్ద కిలోకు 16 వేల రూపాయలకు గంజాయి కొనుగోలు చేశారు.

ఇది చదవండి: ఛీ.. ఛీ.! ఇదేం పని.. కారులో నలుగురు పిల్లల ముందు శృంగారం.. ఆ తర్వాత సీన్ ఇది

దాన్ని మంచిర్యాల ప్రాంతంలో యువకులకు 20 గ్రాములకు 200 రూపాయల చొప్పున గంజాయి విక్రయిస్తున్నారని డీసీపీ వివరించారు. గోదావరిఖనికి చెందిన ప్రేమ్ అనే వ్యక్తికి రైల్వే స్టేషన్‌లో గంజాయి అమ్ముతుండగా నలుగురు వ్యక్తులు పట్టుపడ్డారని తెలిపారు. వీరి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయి, 4000 రూపాయలు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపించినట్లు డీసీపీ తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు నార్కోటిక్ డ్రగ్ టెస్టింగ్ కిట్లను ప్రతి పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంచామన్నారు. గంజాయి రహిత మంచిర్యాల జిల్లాగా కృషి చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని డీసీపీ భాస్కర్ వెల్లడించారు.

ఇది చదవండి: రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. ఎక్కడంటారా

Follow us
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!