2021 టోక్యో ఒలంపిక్స్ కు కౌంట్ డౌన్ స్టార్ట్..
కరోనా వైరస్ ప్రపంచం దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో టోక్స్ ఒలిపింక్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. ఈ సంవత్సరం జూలై 24(శుక్రవారం) నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది.

కరోనా వైరస్ ప్రపంచం దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో టోక్స్ ఒలిపింక్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. ఈ సంవత్సరం జూలై 24(శుక్రవారం) నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై ముందు నుంచి అనుమానాలు తలెత్తాయి. అనుకున్నట్లుగానే టోక్సో ఒలంపిక్స్ ను ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ఒలంపిక్స్ ను 2021వరకు వాయిదా వాసే తీర్మాణానికి ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. అన్ని బాగుంటే ఈ శుక్రవారం టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం అయ్యేవి. సంవత్సరం పాటు వాయిదా వేసిన నేపథ్యంలో అత్యంత సాధాసీదాగా వన్ ఇయర్ కౌంట్ డౌన్ ప్రారంభించారు నిర్వాహకులు.
ఆడియెన్స్ ఎవరూ లేని ఓ ఆడిటోరియంలో 15 నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఆటల కోసం తీవ్రంగా శిక్షణ పొందుతున్న అథ్లెట్లను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భానికి గుర్తుగా కొత్తగా నిర్మించిన అరియాక్ అరేనాతో సహా వచ్చే ఏడాది ఒలింపిక్స్ ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చే వివిధ వేదికలు ఒలింపిక్ రంగులలో వెలిగిపోయాయి.