Watch Video: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న యువతిపై అత్యాచారయత్నం.. కట్ చేస్తే వాడి పరిస్థితి ఇదీ..!

సాధారణంగానే అపార్ట్‌మెంట్స్, గెటెడ్ కమ్యూనిటీలలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతులు ఉంటాయి. జిమ్, రన్నింగ్, స్విమ్మింగ్, యోగా, పార్క్ వంటి సకల సౌకర్యాలు ఉంటాయి.

Watch Video: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న యువతిపై అత్యాచారయత్నం.. కట్ చేస్తే వాడి పరిస్థితి ఇదీ..!
Woman Fighting

Updated on: Feb 17, 2023 | 8:38 PM

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న యువతిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. అయితే, ఎంతో చాకచక్యంగా, ధైర్యంగా ఆ కీచకుడికి చుక్కలు చూపింది. అతను బలప్రయోగం చేయగా.. తన శక్తినంతా కూడదీసుకుని, అతన్ని ధీటుగా ఎదిరించింది. యువతి ధీరత్వానికి కీచకుడు తలొగ్గాల్సి వచ్చింది. ఆమె ఇచ్చిన ఒక్క పంచ్‌తో అయోమయం అయిపోయాడు. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీ, అరెస్ట్ అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ వైరల్ అయ్యాయి. టంపా నగరానికి చెందిన నషాలి అల్మా(24) ఫిట్‌నెస్‌ మోడల్‌. ఖాళీ సమయంలో తన అపార్ట్‌మెంట్‌లోని జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోంది. అయితే, తాను వర్కౌట్స్ చేస్తున్న సమయంలో జిమ్‌లో ఆమె ఒక్కతే ఉంది. అది గమనించిన కీచకుడు.. తాను కూడా వర్కౌట్స్ చేస్తానంటూ వచ్చేశాడు. కాసేపు జిమ్‌లో మమ అన్నట్లుగా చిన్న చిన్న వర్కౌట్స్ చేశాడు. ఆ తరువాత తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. అమ్మాయిని సమీపించాడు. ఆమెపై బలత్కారం చేయబోయాడు. అయితే, యువతి అతన్ని ప్రతిఘటించింది. అతనితో పోరాడింది. ఆ కీచకుడు తన బలాన్నంతా ఉపయోగించి యువతిపై బలాత్కారం చేయబోగా.. ఏమాత్రం బెదరకుండా ధైర్యంగా పోరాడింది. అతనిపై పంచ్‌ల వర్షం కురిపించింది. అమ్మాయి దెబ్బలకు కీచకుడి మైండ్ బ్లాంక్ అయ్యింది. కళ్లు బైర్లు కమ్మి.. గింగిరాలు తిరిగాడు. ఇంతలో యువతి అతని చెర నుంచి తప్పించుకుంది. వెంటనే పోలీసులకు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కీచకుడిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, యువతిపై కీచకుడు దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది. యువతి ధైర్యానికి సలామ్ చెబుతున్నారు నెటిజన్లు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..