Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో దూసుకొచ్చిన రైలు.. ఆతర్వాత..!

పెరుగుతున్న టెక్నాలజీ మనిషి జీవితాలనే మార్చేసింది. సెల్‌ఫోన్ యుగంలో జనం పరిసరాలనే మర్చిపోతున్నారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఓ యువకుడు తానూ ఏం చేస్తున్నాడో మరిచిపోయాడు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ లీనమైన యువకుడు రైల్వే ట్రాక్‌పై ఉన్నానన్న విషయం సైతం మరిచిపోయాడు.

Watch Video: రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతున్న యువకుడు.. ఇంతలో దూసుకొచ్చిన రైలు.. ఆతర్వాత..!
Railways
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 29, 2025 | 5:47 PM

అధునిక యుగంలో మొబైల్ ఫోన్లు మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరికి ఒక సెల్‌ఫోన్ ఉండాల్సింది. కూర్చొన్న, నిల్చున్న, పడుకున్నా.. ఇలా ఏం చేసిన మొబైల్ ఫోన్‌లో లీనమవుతున్నారు. కనీసం పరిసరాలను సైతం మర్చిపోతున్నారు. అయితే వైరల్‌గా మారిన ఓ వీడియో క్లిప్‌ను చూసిన నెటిజన్లు.. ఆ సోదరుడు ప్రేమలో పడి అంధుడిగా మారడమే కాకుండా చెవిటివాడు కూడా అయ్యాడని అంటున్నారు.

ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై కూర్చుని తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అతగాడి వెనుక నుంచి రైలు వేగంగా వస్తున్న విషయం కూడా గమనించడం లేదు. అయితే ఆ వీడియోలో రైలు లోకో పైలట్ తర్వాత చేసిన పని చాలా పవర్ ఫుల్ గా ఉంది. అందుకే ఈ వీడియో వేగంగా వైరల్ అవడమే కాకుండా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో, రైల్వే ట్రాక్‌పై ఒక యువకుడు కూర్చుని ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి రైలు వస్తోంది. లోకో పైలట్ పదే పదే హారన్ కొట్టిన తర్వాత కూడా అతడి మాట వినడం లేదు ఆ కుర్రాడు. అలాగే ఫోన్‌లో మాట్లాడటంలో మునిగిపోయాడు. దీంతో లోక్ పైలట్‌ బలవంతంగా భారీ రైలును బలవంతంగా ఆపేశాడు.

వీడియో చూడండి… 

కానీ దీని తర్వాత లోకో పైలట్ యువకుడికి అతని అసలు రూపాన్ని చూపించాడు. అతని చిలుకలు ఎగిరిపోయాయి. అతను వెంటనే అక్కడ నుండి పారిపోయాడు. కోపోద్రిక్తుడైన లోకో పైలట్ రైలు దిగిన వెంటనే యువకుడిపై రాయి విసిరినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీని తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయిన తీరు కూడా చూడాల్సిందే..! జనవరి 25న ఇన్‌స్టా హ్యాండిల్ @army_lover_ajay_yadav_ghzipur నుండి అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. యూజర్ క్యాప్షన్ ప్రకారం, ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో జరిగింది. పిచ్చికి ఒక హద్దు ఉంటుంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా వీక్షించగా, లక్ష మందికి పైగా వినియోగదారులు దీన్ని లైక్ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరైతే లోక్ పైలట్‌కు రబ్బరు తుపాకీ ఇవ్వాలని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. అలాంటి వారికి ఇదే చికిత్స. మరో వినియోగదారు, రైలు ఆగవచ్చు కానీ మీ స్నేహితురాలితో మాట్లాడటం ఆగకూడదన్నాడు. మరొక వినియోగదారు చమత్కరిస్తూ, అలాంటి పిచ్చిని ఎప్పుడూ చూడలేదంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..