Watch: అయ్యో అక్క ఎంత పనాయే.. జుట్టును స్ట్రెయిట్ చేయాలనుకుంది.. చివరకు..
ఓ యువతి తన జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవడానికి ఇంట్లోనే ఓ ట్రిక్ ప్లే చేసింది. ఇందుకోసం మార్కెట్లో లభించే ఖరీదైన సాధనాన్ని వాడకుండా..వంటింట్లో ఉపయోగించే పరికరాన్ని వాడింది. దీంతో మొదటికే మోసం వచ్చినంతపనైంది. వంటింట్లో ఉన్న పట్కారా వంటి ఒక స్టీల్ వస్తువును గ్యాస్ మంటపై వేడి చేసి జుట్టును స్ట్రెయిట్ చేసేందుకు ట్రై చేసింది. కానీ, ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో మీరే చూడండి..

అమ్మాయిలు, ఆడవాళ్లకు అందంపై, నగలపై ఎంత మక్కువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఎటైన బయటకు వెళ్లాలన్నా అందంగా కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది. ఈ అందాన్ని మరింత ఆకర్షణీయంగా చూపించుకునేందుకు ఆడవారు అనవసరపు కెమికల్స్‌తో కూడిన క్రీమ్స్, హెయిర్ స్టైల్స్ చేసుకుంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్తారు. వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. హెయిర్ స్టైల్స్ కోసం గింగిరాల జుట్టు, వంకర్లు తిరిగిన వెంట్రుకలను స్ట్రెయిట్ చేయడంపై కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి పని చేసిన ఓ అమ్మాయికి ఏం జరిగిందో చూపించే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో.. ఓ యువతి తన జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవడానికి ఇంట్లోనే ఓ ట్రిక్ ప్లే చేసింది. ఇందుకోసం మార్కెట్లో లభించే ఖరీదైన సాధనాన్ని వాడకుండా..వంటింట్లో ఉపయోగించే పరికరాన్ని వాడింది. దీంతో మొదటికే మోసం వచ్చినంతపనైంది. వంటింట్లో ఉన్న పట్కారా వంటి ఒక స్టీల్ వస్తువును గ్యాస్ మంటపై వేడి చేసి జుట్టును స్ట్రెయిట్ చేసేందుకు ట్రై చేసింది. కానీ, ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో మీరే చూడండి..
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
స్టీల్ పరికరాన్ని మంటల్లో వేడి చేసి జుట్టును స్ట్రెయిట్ చేసే ప్రయత్నంలో ఆ వేడికి జుట్టు బాగా కాలిపోయి ఊడిపోయింది. కుచ్చులుగా ఊడివచ్చేసిన జుట్టు మంటల్లో కాలిపోయింది.. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఇకపై ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని వార్నింగ్ కూడా ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




