Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife Birthday: భార్య పుట్టినరోజును మరచిపోతే జైలు శిక్ష, ఈ దేశంలో ఆ వింత చట్టం..

ఆ దేశంలో భర్త తన భార్య పుట్టినరోజును మొదటిసారి మరచిపోతే.. అతన్ని హెచ్చరిస్తారు. రెండోసారి తప్పు చేస్తే భర్తకు జరిమానా లేదా జైలు శిక్ష. ఈ చట్టం ఎక్కడో తెలిస్తే..

Wife Birthday: భార్య పుట్టినరోజును మరచిపోతే జైలు శిక్ష, ఈ దేశంలో ఆ వింత చట్టం..
Forgetting Wife's Birthday Is Illegal
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 13, 2023 | 10:56 AM

“కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.”

ఇంటి పనులు చెయ్యడంలో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ ఆరు పనులతో ఉండేది ధర్మపత్ని. ఇదీ ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ షట్కర్మ బదులు షద్ధర్మ అని పాఠభేదం కూడా ఉంది. అయితే ఇంతలా భర్త కోసం నిత్యం శ్రమ చేసే భార్యకు ఆయన అందించే చిన్న బాగుంది అనే పదం పెద్ద ప్రశంసతో సమానం. ఇదిలావుంటే, భార్య పుట్టినరోజును భర్త మరచిపోతే.. ఇంకేమైనా ఉందా.. ఆ ఇళ్లు రణ రంగంలా మారిపోవడం మాత్రం సహజం. ఇలాంటి ఘటనలు మనం అందరి ఇళ్లలోనూ చూస్తూనే ఉంటాం.

మరిచిపోయి.. ఆ తర్వాత సారీతో సరిపెట్టేందుకు ప్రయత్నించే భర్తలు కూడా చాలా మంది మనకు కనిపిస్తుంటారు. దీని తరువాత, అతడిని భార్య క్షమించడం జరిగిపోతుంది. కానీ ఇది ప్రతిచోటా ఇలా ఉండవలసిన అవసరం లేదు. దీంతో చాలా చోట్ల భర్తలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. భర్త మళ్లీ ఈ తప్పు చేయడు. అవును, మనం మాట్లాడుతున్న ప్రదేశం మన దేశంలో మాత్రం కాదు. అక్కడ భార్య పుట్టినరోజును మరచిపోవడం అతి పెద్ద నేరం. చట్టం ప్రకారం, ఈ నేరానికి భర్తకు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. అటువంటి కఠినమైన చట్టం ఏ దేశంలోనైనా వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

మొదటి తప్పుకు వార్నింగ్..

అందానికి ప్రసిద్ధి చెందిన సమోవా దేశంలో ఈ చట్టం ఉంది. అంతే కాదు ఈ చట్టాన్ని కూడా కచ్చితంగా పాటిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, సమోవా దేశంలో భర్త తన భార్య పుట్టినరోజును మొదటిసారి మరచిపోతే… అతన్ని హెచ్చరిస్తారు. ఆ తప్పు రెండోసారి జరిగితే భర్తకు జరిమానా లేదా జైలు శిక్ష. చట్టంలో ఈ నేరానికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే చట్టం ఉంది.

చట్టం అమలు కోసం ఓ టీమ్ కూడా..

అక్కడ ఉన్న ఈ చట్టాన్ని తప్పకుండా ప్రతి ఇంట్లో పాటించాలి. ఈ చట్టాన్ని అనుసరించేలా సమోవాలో ప్రత్యేక టీమ్ కూడా ఉంది. ఇందుకోసం పోలీసు అధికారి స్థాయిలో  ఓ స్పెషల్ టీమ్  పనిచేస్తోంది. ఎవరైన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదని ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటారు. అంతే కాదు, మధ్యమధ్యలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ భార్యలకు కూడా ఈ చట్టం గురించి చెబుతారు.

ఈ దేశంలో జాగింగ్ చట్టవిరుద్ధం

అయితే, భార్య పుట్టినరోజును మరచిపోయినందుకు శిక్షలు ఉన్నట్లుగానే తూర్పు ఆఫ్రికాలో మరో చట్టం ఉంది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వింత చట్టం ఇక్కడ అమలులో ఉంది. ప్రజలు ఇక్కడ జాగింగ్‌కు వెళ్లేందుకు అనుమతి లేదు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం