Viral Video: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కుక్క.. మనుషులకు ఆత్మవిశ్వాసం పాఠం నేర్పిస్తోంది.. వీడియో వైరల్..

|

Jul 05, 2022 | 1:53 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ మైదానంలో చిన్న, పెద్ద కుక్క పిల్లలు చాలానే ఉన్నాయి. వాటి చుట్టూ ఐరన్ గేట్ కూడా అమర్చబడి ఉంది.

Viral Video: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కుక్క.. మనుషులకు ఆత్మవిశ్వాసం పాఠం నేర్పిస్తోంది.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

ఆత్మబలం ఉంటే సాధ్యం కాని పనంటూ ఉండదు. ఆత్మ విశ్వాసం ముందు ఎంత పెద్ద సమస్యలనైనా ఎదుర్కొవచ్చని పెద్దలు చెబుతుంటారు. మన వల్ల కాదు అంటూ ప్రయత్నం చేయకుండా వదిలి పెట్టేవారిని పిరికివారిగా పరిగణిస్తారు. ఈ ఆత్మవిశ్వాసం.. తమపై తమకు నమ్మకమనేవి కేవలం మనుషలలో మాత్రమే కాదు జంతువులలోనూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు నిజమే అని ఒప్పుకుంటారు. ఓ చిన్న కుక్క పిల్ల ధైర్యం చూస్తే షాకవుతారు. పెద్ద గేటును అవలీలగా ఎక్కెసి ఔరా అనిపించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ మైదానంలో చిన్న, పెద్ద కుక్క పిల్లలు చాలానే ఉన్నాయి. వాటి చుట్టూ ఐరన్ గేట్ కూడా అమర్చబడి ఉంది. ఆ గేట్ నుంచి బయటకు వచ్చేందుకు ఆ కుక్క పిల్లలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అందులో ఓ చిన్న కుక్కపిల్ల మాత్రం ఏకంగా ఎన్‏క్లోజర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ పెద్ద సాహసమే చేసింది. ముందుగా ఆ కుక్క పిల్ల ఐరన్ గేట్ నెమ్మదిగా ఎక్కడం మొదలు పెట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో స్టెప్ ఎక్కుతూ గేట్ చివరకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కుక్క పిల్ల చేసిన పనికి చూసి నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత కష్టమొచ్చిన ధైర్యాన్ని కోల్పోవద్దని.. ఆత్మ విశ్వాసం ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొవచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.