ప్రపంచంలోనే అందమైన క్రిమినల్‌కు 24ఏళ్ల జైలు శిక్ష..! సోషల్ మీడియాలో పెరిగిన మద్ధతు..

కామెరాన్ హెర్రిన్ కేసు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అతివేగంతో కారు నడిపి తల్లి, బిడ్డ మరణానికి కారణమైన హెర్రిన్‌కు 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే, అతని అందాన్ని చూసి చాలా మంది క్షమాభిక్ష కోరడం చర్చనీయాంశంగా మారింది. అందం, న్యాయం మధ్య ఈ పోలిక మానవత్వం, ఆలోచనలకు సంబంధించిన సందేహాలను లేవనెత్తింది, చట్టం ముందు అందరూ సమానులే అనే పాఠాన్ని నేర్పింది.

ప్రపంచంలోనే అందమైన క్రిమినల్‌కు 24ఏళ్ల జైలు శిక్ష..! సోషల్ మీడియాలో పెరిగిన మద్ధతు..
Most Handsome Criminal

Updated on: Jan 04, 2026 | 11:18 AM

కొన్నిసార్లు సోషల్ మీడియాలో మానవత్వం, ఆలోచన రెండింటి గురించిన సందేహాలను లేవనెత్తే కేసులు బయటపడుతుంటాయి. అలాంటి ఒక కేసు కామెరాన్ హెరిన్ అనే అమెరికన్ యువకుడి విషయంలోనూ జరిగింది. అతన్ని ప్రజలు ప్రపంచంలోని అత్యంత అందమైన నేరస్థుడి పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నేరస్థుడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. కానీ, అతని శిక్షను రద్దు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కారణం అతని స్వరూపం. కానీ, ఆ ముఖం వెనుక ఒక తల్లి, ఆమె అమాయక కుమార్తె ప్రాణాలను బలిగొన్న విషాద కథ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

2018లో జరిగిన ఒక ప్రమాదం కామెరాన్‌ జీవితాన్ని తలకిందులుగా మార్చేసింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కామెరాన్ హెర్రిన్ తన ఫోర్డ్ ముస్తాంగ్‌ను అతి వేగంతో నడుపుతున్నాడు. గంటకు దాదాపు 160 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. అతని కారు వీధి దాటుతున్న 24 ఏళ్ల మహిళ, ఆమె ఏడాది వయసున్న కుమార్తెను ఢీకొట్టింది. ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండటంతో తల్లి, బిడ్డ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత సెప్టెంబర్ 2021లో కోర్టు కామెరాన్ హెరిన్‌కు 24 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని కోర్టు స్పష్టంగా పేర్కొంది. కామెరాన్ శిక్ష విధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు అనుకోని మలుపు తిరిగింది. అతని అందానికి ముగ్ధులైన లక్షలాది మంది ప్రజలు అతనికి మద్దతుగా నిలిచారు. కొందరు అతన్ని అందమైన అమాయకుడిగా భావించి క్షమించాలని కూడా డిమాండ్ చేశారు. అంత అందమైన వ్యక్తి అలాంటి పని ఎలా చేయగలిగాడు? అని కూడా చాలా మంది ప్రశ్నించారు. అతని కళ్ళలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోందని కూడా కొందరు నెటిజన్లు తనకు మద్ధతుగా నిలబడ్డారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా వేదికగా ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒకరి రూపం వారి నేరం కంటే గొప్పదా? అందంగా ఉండటం వల్ల ఎవరైనా తక్కువ దోషులుగా మారుతారా? అంటూ ఇంకొందరు ప్రజలు నిలదీయడం ప్రారంభించారు. కామెరాన్‌ చేసిన ఆక్సిడెంట్‌ కారణంగా చనిపోయిన తల్లి, బిడ్డను సోషల్ మీడియా దాదాపుగా మరచిపోయిందని కూడా చాలా మంది వ్యాఖ్యానించారు.

అసలు కామెరాన్ హెరిన్ ఎవరు?

కామెరాన్ హెరిన్ 1999 సెప్టెంబర్ 9న USAలోని టంపాలో జన్మించాడు. అతను ఒక నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చాడు. అతని తల్లిదండ్రులు అతనిలో కష్టపడి పనిచేయడం, నిజాయితీ విలువలను నింపారని చెబుతారు. కానీ, ఒక తప్పుడు నిర్ణయం అతని మొత్తం జీవితాన్ని మార్చివేసింది.

కామెరాన్ హెరిన్ కేసు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఇద్దరు అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమైన వ్యక్తి పట్ల సానుభూతి కూడా వ్యక్తమైంది. ఈ కథ మనకు అతివేగం అంటే కేవలం మీ ఎంజాయ్‌మెంట్‌ మాత్రమే కాదు, ప్రాణం ఖరీదు కూడా అని గుర్తు చేస్తుంది. ఒక తప్పు జీవితాన్ని మార్చగలదు. చట్టం దృష్టిలో అందమైన ముఖాలు కాదు, చేసిన పనులే ప్రధానం అంటున్నారు చాలా మంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..