AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక.. 521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే మైండ్ బ్లాకే!

సాధారణంగా బంగారం అనగానే మనకు కొన్ని గ్రాముల నాణాలు, గొలుసులు లేదా కొన్ని వందల గ్రాముల బిస్కట్లు గుర్తొస్తాయి. కానీ, ఏకంగా అర టన్ను కంటే ఎక్కువ బరువున్న ఒక్కటే బంగారు ఇటుకను చూస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే వింతగా ఉంది కదూ! మీరు ఊహించలేరు కూడా, ఒక్క వ్యక్తి కాదు కదా, నలుగురు కలిసినా కూడా దీనిని కదపలేరు. ఇక దీనిని ఎత్తడమే అసాధ్యం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థే దీనికి సంబంధించిన ఒక వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @guinnessworldrecordsలో షేర్ చేసింది.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక.. 521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే మైండ్ బ్లాకే!
World's Largest Gold Bar
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2026 | 4:01 PM

Share

ఆస్ట్రేలియాలోని ది పర్త్ మింట్ సరిగ్గా అలాంటి అద్భుతాన్నే ఆవిష్కరించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో తన పేరును లిఖించుకుంది. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థే దీనికి సంబంధించిన ఒక వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @guinnessworldrecordsలో షేర్ చేసింది. ఆ వీడియో వచ్చిన వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఇలాంటి దృశ్యం ప్రతిరోజూ కనిపించదు కాబట్టి ప్రజలు అదే వీడియోను పదే పదే చూస్తున్నారు.

8 మంది పురుషుల బరువుతో సమానం!:

పర్త్ మింట్ తయారు చేసిన ఈ భారీ గోల్డ్ బార్ బరువు 521.2 కిలోగ్రాములు (సుమారు 1,149 పౌండ్లు). గిన్నిస్ వర్గాల ప్రకారం, ఈ బరువు సగటున ఎనిమిది మంది ఆరోగ్యవంతమైన పురుషుల మొత్తం బరువుతో సమానం. దీనిని ఒక్కరు లేదా నలుగురు కలిసి కూడా చేతులతో కనీసం కదపలేరు. యంత్రాల సహాయంతోనే దీనిని తరలించాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

99.999శాతం అత్యున్నత స్వచ్ఛత:

ఈ బంగారు ఇటుక ప్రత్యేకత కేవలం దాని బరువు మాత్రమే కాదు, దాని స్వచ్ఛత. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఫైవ్ నైన్స్ (99.999శాతం) ప్యూరిటీతో దీనిని తయారు చేశారు. సాధారణంగా పరిశ్రమల్లో 99.99శాతం వరకు మాత్రమే స్వచ్ఛత సాధిస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియాలోని 9 ప్రముఖ గోల్డ్ మైనింగ్ కంపెనీలు సహకారాన్ని అందించాయి. 35 మందికి పైగా లోహ రసాయనిక నిపుణులు ఫ్లేమ్‌లెస్ కాస్టింగ్ ఛాంబర్‌లో సోనాన్ని 1,400 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగించి, గంటల తరబడి నియంత్రిత ఉష్ణోగ్రత వద్ద చల్లార్చి దీనిని తీర్చిదిద్దారు.

దుబాయ్ పాత రికార్డు పటాపంచలు:

గతంలో దుబాయ్ మింటింగ్ ఫ్యాక్టరీ పేరిట ఉన్న 300 కిలోల వరల్డ్ రికార్డును ఆస్ట్రేలియా పర్త్ మింట్ ఈ కొత్త ఇటుకతో అధిగమించింది. ఈ బంగారు ఇటుక విలువ పసిడి మార్కెట్ ధరకు అనుగుణంగా వేల కోట్ల రూపాయలలో ఉంటుంది.

ఇప్పుడేం చేయనున్నారు?:

ఈ భారీ బంగారు ఇటుకను రహస్య దాపరికాలలో దాచడం లేదు. పర్త్ మింట్‌ను సందర్శించే సామాన్య ప్రజలు, పర్యాటకులు వీక్షించేందుకు ప్రదర్శనగా ఉంచనున్నారు. ప్రపంచంలోనే అత్యంత బరువైన పసిడి దృశ్యాన్ని తమ కళ్లతో చూడటం ఒక అరుదైన అనుభవంగా నిలవనుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us