Beautician: అరగంట ఎండలో నిద్రపోయిన బ్యూటిషన్.. ఆ తర్వాత ఆమె చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయింది!

|

Aug 22, 2022 | 7:59 AM

నుదిటిపై చర్మంతో పాటు కళ్ల చుట్టూ చిన్న చిన్న మచ్చలు కూడా ఏర్పడ్డాయి. ఆ మర్నాడు కొద్ది కొద్దిగా ముఖంపై చర్మం ఊడిపోవడం మొదలైంది. దాంతో

Beautician: అరగంట ఎండలో నిద్రపోయిన బ్యూటిషన్.. ఆ తర్వాత ఆమె చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయింది!
Beautician
Follow us on

Beautician: ఎండలో పడుకోవడం చాలా మందికి ఓ సాధారణ అలవాటు. అయితే, ఇది నీడలో చేయడం మంచిది. ఎందుకంటే మీరు ప్రత్యక్ష సూర్యకాంతిలో ఎక్కువసేపు నిద్రపోతే, మీకు కూడా ఈ మహిళకు ఎదురైన చిత్ర పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుంది. చల్లటి గాలిలో సూర్యకాంతి వేడిలో హాయిగా సేద తీరేందుకు చాలా మంది బీచ్‌లను ఆశ్రయిస్తుంటారు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతుంటారు. అయితే మరి వేడి ఉష్ణోగ్రతలో అధిక సమయం గడపడం మంచిది కాదని ఈ ఘటన చెబుతోంది. ఎందుకంటే ఓ 25 ఏళ్ల అమ్మాయి వేడి వాతావరణంలో ఎక్కువ సేపు నిద్రించడం వల్ల తన ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లుగా మారిపోంది. ప్రముఖ బ్యూటీషియన్ సిరిన్ మురాద్‌కు ఎదురైంది ఈ విచిత్ర పరిస్థితి..

వృత్తి రీత్యా..బ్యూటీషియన్ అయిన 25ఏళ్ల సిరిన్ మురాద్.. బల్గేరియన్ బీచ్‌లో దాదాపు అరగంట పాటు నిద్రపోవడం వల్ల తన ముఖాన్ని తానే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 21ºC ఉష్ణోగ్రతలో బీచ్‌లో 30 నిమిషాలపాటు గడిపిన సిరిన్.. ఎండ తీవ్రత ఎక్కువగా అనిపించిన టైమ్‌లో..తన ఫేస్ కొద్దిగా నొప్పిగా, ఎర్రగా మారినట్టుగా భావించింది. అయితే, ఆ ప్రభావం మరుసటి రోజు తన ముఖంలో స్పష్టంగా బయటపడింది. ముఖంలో ముడతలుగా కనిపించడంతో సిరిన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. నుదిటిపై చర్మంతో పాటు కళ్ల చుట్టూ చిన్న చిన్న మచ్చలు కూడా ఏర్పడ్డాయి. ఆ మర్నాడు కొద్ది కొద్దిగా ముఖంపై చర్మం ఊడిపోవడం మొదలైంది. దాంతో వెంటనే ఆమె డాక్టర్‌ని సంప్రదించింది. అయితే, ఆమె ఫేస్ స్కిన్ నార్మల్ స్థితికి రావడానికి ఏడు వారాలు పట్టింది.

అయితే, ముఖంపై చర్మం ఊడిపోయిన తర్వాత విచిత్రంగా తన ముఖం మునుపటి కంటే మెరుగ్గా ఉందని చెప్పింది సిరిన్‌. ఆమె బుగ్గలపై, ఆమె కళ్ల కింద రంగు మారిన కొన్ని మచ్చలు మాత్రమే ఉన్నాయి. కానీ, ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌స్క్రీమ్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే చర్మం ఎల్లప్పుడూ సూర్యరశ్మికి గాయపడుతుంది. క్రీమ్ యొక్క మాస్క్ మన చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించడమే కాకుండా ముడతలు, అవాంఛిత పిగ్మెంటేషన్‌తో సహా చర్మం దెబ్బతినకుండా రక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి