Viral: ఇలాంటి వింతలెన్నో.. మెట్రోలో ఓ వ్యక్తిపై చేయి చేసుకున్న యువతి.. క్షణాల్లో వీడియో వైరల్..
ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల వింత వింత ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి..
ఢిల్లీ మెట్రోలో ప్రయాణికుల వింత వింత ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి మరో వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ మహిళ తనతో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని లాగి చెంపపై కొట్టింది. ట్విట్టర్ యూజర్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా 67 వేల వ్యూస్ లభించాయి.
వీడియోలో మహిళ తన పక్కన నిల్చున్న వ్యక్తిపై కేకలు వేసింది. ఘర్షణకు కారణమేంటనే వివరాలు స్పష్టంగా వెల్లడికాలేదు. సదరు వ్యక్తిపై కోపంతో ఊగిపోయిన ఆ మహిళ.. అతడిపై చేయి చేసుకుంది. ఈ తతంగాన్ని పక్కనే ఉన్న తోటి ప్రయాణీకులు వీడియో తీసి ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. ఇక గొడవపడుతున్న ఆ ఇద్దరినీ విడదీయకుండా.. మిగిలిన వారంతా దాన్ని చోద్యం చూసినట్టు చూశారు. ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.
Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) – Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023