AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మాజీ ప్రియుడికి షాకిచ్చిన మహిళ.. రివెంజ్ మాములుగా లేదుగా.. ఏం చేసిందో తెలిస్తే షాకే.!

Viral News: ప్రతీకారం అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని అందరూ అంటారు. విషయం ఏదైనా కూడా.. దెబ్బతిన్న వ్యక్తి తీర్చుకునే రివెంజ్‌ను అస్సలు ఊహించలేం..

Viral News: మాజీ ప్రియుడికి షాకిచ్చిన మహిళ.. రివెంజ్ మాములుగా లేదుగా.. ఏం చేసిందో తెలిస్తే షాకే.!
Woman
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 15, 2021 | 8:40 PM

Share

ప్రతీకారం అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని అందరూ అంటారు. విషయం ఏదైనా కూడా.. దెబ్బతిన్న వ్యక్తి తీర్చుకునే రివెంజ్‌ను అస్సలు ఊహించలేం. వాస్తవానికి ఏదైనా బంధం నుంచి తెగదెంపులు జరిగితే.. అది ఎంతో బాధను మిగిలిస్తుంది. చాలామంది ప్రజలు వాస్తవికతను సులభంగా అంగీకరించి జీవితంలో ముందుకు వెళ్లిపోతారు. మరికొందరైతే మాత్రం ప్రతీకార జ్వాలలతో రగిలిపోతారు. అదును చూసుకుని వచ్చిన అవకాశంతో ఇతరలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తుంటారు. సరిగ్గా ఇదే రీతిలో బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హద్దులను దాటేసింది. మహిళ రివెంజ్ తీర్చుకునేందుకు ఎంచుకున్న మార్గం తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే..

46 ఏళ్ల ఫిలిప్పా వారెన్ అనే మహిళ తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే సీక్రెట్‌గా అతడిపై నిఘా పెట్టి.. నగ్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో లీక్ చేసింది. అంతేకాకుండా అతడి దగ్గర ఉన్న అమెజాన్ అలెక్సాను హ్యాక్ చేసి అతడి ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్‌ను బెదిరించింది. ఫిలిప్పా తన దగ్గర ఉన్న యాప్ ద్వారా మాజీ ప్రియుడి ఇంట్లో ఉన్న అలెక్సా గ్యాడ్జెట్‌ను కనెక్ట్ చేసింది. అలాగే అతడి ఇంట్లోని సీసీ కెమెరాలను తన అధీనంలోకి తెచ్చుకుని తన మాజీ ప్రేమికుడిపై నిఘా పెట్టడం ప్రారంభించింది. తద్వారా అతడి నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ఇక అమెజాన్ అలెక్సా ద్వారా ఫిలిప్పా.. అతడి ప్రస్తుత గర్ల్‌ఫ్రెండ్‌ను బెదిరించడం మొదలుపెట్టింది. అతడి ఇంటికి వచ్చిన ప్రతీసారి ఆమెను భయపెట్టింది. అలెక్సా ద్వారా మాట్లాడి ఆమెను బెదిరించడమే కాకుండా.. అప్పుడప్పుడూ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ భయపెట్టింది. ఇక ఈ తతంగం మొత్తం మాజీ ప్రేమికుడికి తెలియడంతో.. అతడు ఆమెపై కేసు వేశాడు. ఈ కేసు బ్రిటన్‌లోని ఐల్‌వర్త్ క్రౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. ఇరువైపుల వాదనలను విన్న కోర్టు ఫిలిప్పాకు శిక్ష విధించగా.. ఆమె అక్టోబర్ 6, 2020న బెయిల్‌పై విడుదలైంది.

Girl Firend

Read Also: బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..