Viral: అద్దె బైక్ తీసుకుని స్టార్ట్ చేస్తుండగా.. సీటు కింద ఏదో అలికిడి.. అనుమానమొచ్చి చూడగా
చెన్నైలోని షాంఘైలో ఓ వింత సంఘటన జరిగింది. ఓ మహిళ అద్దె బైక్ తీసుకోగా.. దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆమెకు విచిత్రమైన అలికిడి వినిపించింది. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ ఆర్టికల్ లుక్కేయండి మరి.

ఏదైనా పని మీద మనం వేరే ప్రాంతానికి వెళ్తుంటాం. పని బట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా ఆటో.. లేదా అద్దెకు బైక్ తీసుకుంటుంటాం. సరిగ్గా ఓ మహిళ కూడా ఇదే పని చేసింది. పని మీద వేరే ఊరు వెళ్లి.. అక్కడ ఓ రెంటల్ బైక్ తీసుకుంది. ఇక దాన్ని స్టార్ట్ చేసి వెళ్దామని అనుకున్న ఆమెకు.. దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది. ఆ బైక్ సీట్ కింద నుంచి ఏదో అలికిడి వినిపించింది.. అనుమానమొచ్చి చూడగా..
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని షాంఘైలో ఒక మహిళకు వింత అనుభవం ఎదురైంది. తాను అద్దెకు తీసుకున్న బైక్ సీటు కింద ఏదో వస్తువు ఉన్నట్టు గుర్తించింది. ఆమె తన భర్తతో కలిసి సైకిల్ తొక్కుతుండగా.. అసాధారణ స్థితిలో తన సీటు ఉబ్బినట్లుగా గమనించింది. ఆపై బైకు సీటును పరిశీలించగా.. సీటు కుషన్ లోపల ఏదో పరికరం ఉన్నట్టు కనుగొంది.
సైకిల్ తొక్కుతున్న ప్రతీసారి ఆ పరికరం పని చేయడం.. అలాగే సీటు కింద నుంచి ఏదో అలికిడి వస్తుండటంతో.. సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఇక ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే రోజు రాత్రి 41 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. మానసిక ఉద్దీపన పొందటానికి ఆ పరికరాన్ని బైక్ సీటులో ఉంచినట్టు సదరు వ్యక్తి పోలీసులకు చెప్పాడట. కాగా, ఈ ఘటనపై త్వరతగిన దర్యాప్తు జరుగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..