AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

అడవి లేదా కొండ ప్రాంతాలలో హైకింగ్ చేయడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఒక్కోసారి అంతే ప్రమాదకరంగా మారుతుంటుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఒక మహిళకు సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది. తన పెంపుడు కుక్కను తీసుకుని ఉదయం పూట నడవడానికి వెళ్లిన ఆమె, చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో తిరిగి వచ్చింది. ఈ భయంకరమైన క్షణాలన్నీ ఆమె మొబైల్ కెమెరాలో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా నెట్టింట షేక్ చేస్తోంది.

Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!
Grizzly Bear Attack
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2026 | 8:15 PM

Share

చాలా మంది అడవులను అన్వేషించడం, ప్రకృతిని దగ్గరగా గమనించడం ఆనందిస్తారు. కానీ, కొన్నిసార్లు ఈ ఇష్టమే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కెనడాకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ ప్రమాదకరమైన గ్రిజ్లీ ఎలుగుబంటిని ఎదుర్కోవడం కనిపిస్తుంది. మౌంట్ ఎంగాడిన్ లాడ్జ్ సమీపంలో సదరు మహిళ తన పెంపుడు కుక్క స్కోకితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా సుమారు 180 కిలోల బరువున్న ఒక భారీ గ్రిజ్లీ ఎలుగుబంటి వారి ముందుకు వచ్చింది. మనిషిని, కుక్కను చూడగానే ఆ క్రూర జంతువు వారిని వెంటాడటం ప్రారంభించింది.

దాడికి ప్రయత్నం – ఊహించని ధైర్యం

ఎలుగుబంటి తమ వైపు వస్తుండటాన్ని గమనించిన మహిళ కంగారుపడి పరుగెత్తలేదు. ఎందుకంటే ఎలుగుబంటిని చూసి పరిగెత్తితే అది మరింత రెచ్చిపోయి వేగంగా దాడి చేస్తుంది. అందుకే ఆమె వెనక్కి అడుగులు వేస్తూనే ఎంతో గంభీరమైన స్వరంతో నో.. గో అవే (వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో) అంటూ ఎలుగుబంటిని వారించడానికి ప్రయత్నించింది. కానీ, ఆ ఎలుగుబంటి ఒక్కసారిగా ఆమె వైపు దూసుకొచ్చింది (Charge చేసింది). ఒక దశలో అది కేవలం ఒక మీటరు దూరంలోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ఆ సమయంలో ఆమె భయంతో కేకలు వేస్తూనే, స్టాప్ ఇట్.. గో అవే.. ఇనఫ్ (ఆపు, వెళ్ళిపో, ఇక చాలు) అంటూ ఎలుగుబంటి కళ్లల్లోకి చూస్తూ నిలబడింది. ఆ మహిళా చూపిన అద్భుతమైన ఆత్మవిశ్వాసం, ధైర్యం చూసి ఆ గ్రిజ్లీ ఎలుగుబంటి కొంత గందరగోళానికి గురైంది. కొద్దిసేపు అక్కడే తిరుగుతూ దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఆమె అరుపులకు వెనక్కి తగ్గి పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది.

వీడియో ఇక్కడ చూడండి..

అధికారుల హెచ్చరిక…

ఈ సంఘటన తర్వాత అప్రమత్తమైన ఆల్బెర్టా ఫారెస్ట్రీ అండ్ పార్క్స్ అధికారులు ఆ ప్రాంతంలో బేర్ వార్నింగ్ (ఎలుగుబంట్ల హెచ్చరిక) జారీ చేశారు. వన్యప్రాణుల నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎలుగుబంట్లు సాధారణంగా కుక్కల పట్ల ఎక్కువ ఆసక్తిని లేదా దూకుడును ప్రదర్శిస్తాయి. అందువల్ల అడవుల్లోకి వెళ్లేటప్పుడు కేవలం బేర్ బెల్స్ (గంటలు) పైనే ఆధారపడకుండా, రక్షణ కోసం బేర్ స్ప్రేను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని పర్యాటకులకు సూచిస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్న ఆ మహిళ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
దిండు కింద నాణెం, ఈశాన్యంలో ఈ విగ్రహాలు.. మీ అదృష్టం మారడం ఖాయం
దిండు కింద నాణెం, ఈశాన్యంలో ఈ విగ్రహాలు.. మీ అదృష్టం మారడం ఖాయం
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే
గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?
రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌
రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌
వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!
వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..