
పెరులోని లంబాయెక్ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చనిపోయిన మహిళ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, ఉన్నట్టుండి లేచి కూర్చుంది. మహిళను శవపేటికలో పెట్టి కొద్ది క్షణాల్లో ఆమెను పూడ్చిపెడతారనగా.. శవ పేటిక నుంచి శబ్దం వచ్చింది. తెరిచి చూసిన బంధువులు, స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే..చనిపోయిందనుకున్న మహిళ శవ పెటికలో లేచి కూర్చుని కనిపించింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
లంబాయెక్ ప్రాంతానికి చెందిన రోసా అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కలిసి కారులో బయటకు వెళ్లింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారి కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోసా బావ చనిపోయాడు. ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. రోసాకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు. రోసాను శవ పేటికలో పెట్టి మూసివేశారు. శవ పేటికను గోతిలో కప్పెట్టేందుకు కుటుంబీకులు భుజాలపై పెట్టుకున్నారు. ఆ సమయంలో రోసా అపస్మారక స్థితి నుంచి బయటకొచ్చింది. శవపేటిక లోపలి నుంచి ‘‘నేను బతికే ఉన్నాను’’ అంటూ గట్టిగా అరిచింది.
శవ పేటికను బాదుతూ శబ్దం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు శవపేటికను కిందకు దించి తెరిచి చూశారు. వెంటనే రోసా అందులో నుంచి లేచి కూర్చొని ‘‘నేను బతికే ఉన్నాను’’ అని చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను శవపేటిక నుంచి బయటకు తీయకుండానే అంబులెన్స్ ఎక్కించారు. వైద్యులు ఆమెకు వెంటనే కృత్రిమ శ్వాసను అందించారు. కానీ, అప్పటికే ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. బ్యాడ్ లక్ ఏమిటంటే అలా బతికిన కొన్ని గంటల తర్వాత ఆమె చనిపోయింది. బతికిందని సంతోషపడేలోపే ఆమె మళ్లీ కన్నుమూయడాన్ని ఆమెకు కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు.
Also Read:
Viral: కూతురికి పెళ్లి చేసేందుకు అబ్బాయిని వెతికిన తండ్రి.. కట్ చేస్తే.. ఆమె చేసిన పనికి అంతా షాక్!
Viral Photo: తోపుడు బండి దగ్గర టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వరుడిని గుర్తుపట్టారా.? ఈజీగా కనిపెట్టొచ్చు
AP: కెనడా నుంచి వెనక్కొచ్చిన పార్శిల్‌పై అనుమానం.. లోపల ఏముందని చెక్ చేయగా మైండ్ బ్లాంక్.!
Viral Photo: దిమాక్ ఖరాబ్.. ఈ ఫోటోలోని అద్భుతాన్ని గుర్తిస్తే మీ కళ్లలో పవర్ ఉన్నట్లే!
Viral Video: కిచెన్‌లో వింత శబ్దాలు.. వెళ్లి చూడగా ఒక్కసారిగా భయంతో గుండె గుభేల్!
Viral Photo: ఈ ఫోటోలోని తప్పును కనిపెడితే మీరు జీనియస్! అంత ఈజీ కాదండోయ్..
Viral: పుట్టబోయే బిడ్డను చూసేందుకు స్కానింగ్.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!