సింహం అడవికి రారాజు. ఇది జగమెరిగిన సత్యం. సింహం గర్జన వినిపిస్తే చాలు మిగిలిన జంతువులు భయంతో గజగజలాడిపోతాయి. అంతటి బలశాలి అయిన సింహం కూడా అప్పుడప్పుడూ ఓటమిని చవి చూడాల్సిందే. ఆ కోవకు చెందిన ఓ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దాన్ని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
కేవలం 13 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సింహానికి అడవి దున్న చుక్కలు చూపించింది. ప్రాణాల కోసం పోరాడుతూ దాని నుంచి తప్పించుకునేందుకు సింహం విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి తోక ముడుచుకుని పరుగులు పెట్టింది. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
వైరల్ వీడియో ప్రకారం.. మంద నుంచి తప్పిపోయిన ఓ అడవి దున్నను వేటాడటానికి సింహం ప్రయత్నిస్తుంది. కానీ ఆ వేట కాస్తా బెడిసికొడుతుంది. ఒక్కసారిగా అడవి దున్న సింహంపై పోరాటానికి దిగుతుంది. కొమ్ములతో పొడుస్తూ సింహాన్ని ఎగిరించి మరీ కుమ్మేస్తుంది. చివరికి అడవి దున్న దెబ్బకు.. పాపం సింహం తోకముడిచి వెనకడుగు వేస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ‘Nature27_12’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటివరకు 68 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.
Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.
డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!
రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..