Birds Viral Video: ఇదేం పిట్టపోరు బాబోయ్..! అల్లాడిపోతున్న ఇంటి వాసులు.. తలకు హెల్మెట్ ఉంటేనే.. (వీడియో)
ఆ ఇంటి పెరట్లోకి వెళ్ళాంటే అందరికీ హడల్. పెరట్లో పిల్లలు స్నానం చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా... హెల్మెట్ లేనిదే ఆ ఇంటి వాళ్ళు పెరట్లోకి వెళ్లలేక పోతున్నారు. అంతగా భయ పెడుతున్న పిట్ట కథ ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు..
నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఉమారాణి వెంకన్న దంపతులు ఉంటున్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో పిల్లలతోనే కాదు పిట్టతో కూడా వేగ లేకపోతున్నారు. ఇంటి పెరట్లోని అరటి చెట్టు మంచిగా గెల వేసింది. రెండు అరటి కాయలు కోయడానికి వెళ్లిన ఉమా రాణి అరటి గెలపై ఉన్న పిట్ట గూడును చూసింది. జాలిపడి ఆ గూడును తీసి వేయకుండా అలాగే ఉంచారు. ఆ పిట్ట కాస్త దాంట్లో గుడ్లు పెట్టి పొదిగింది. అరటి కాయలు రోజురోజుకీ పెరగటం వల్ల పిట్ట గూడు కింద పడి పోయే అంతగా ఒరిగింది. ఉమారాణి తన భర్తను పిలిచి గూడును సరిచేసి కిందపడకుండా పెట్టించింది. ఇది చూసి ఆందోళన చెందిన పిట్ట తన గూడును తీసేస్తారేమోననే ఆందోళనతో పొడవడం ప్రారంభించింది.
పెరట్లోకి వెళ్తే చాలు రెండు పిట్టలు వాళ్ల ఇంటిల్లిపాదిపై దాడి చేస్తున్నాయి. ఎక్కడ కళ్లలో పొడిస్తే…కళ్ళు పోతాయోననే భయంతో వాళ్లంతా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. పిట్టకు భయపడి హెల్మెట్ తో తిరగడం ఇరుగు పొరుగువారు చూసి నవ్వుకుంటున్నారు. అయినా పర్వాలేదు అంటున్నారు..ఆ పిట్టలు ఎగిరిపోయే వరకు ఈ బాధలు తప్పవని సర్దుకుంటున్నారు. ఆ పిట్టకు తన గూడుపై, గూట్లో ఉన్న పిల్లలపై ప్రేమను చూసి అవి పొడిచిన ఆనందంగా భరిస్తున్నారు ఉమారాణి కుటుంబం.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Man swallows phone: ఫోన్ మింగేసిన ఘనుడు..ఆరు నెలలకు అసలు సంగతి..! వైరల్ అవుతున్న వీడియో..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

