Pizza History: ‘పిజ్జా’ పేరు ఇలా వచ్చిందా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫన్నీ లాజిక్..
Pizza History: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు, ఫోటోలో వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ సూపర్ ఫోటో విస్తృతంగా వైరల్ అవుతోంది.
Pizza History: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు, ఫోటోలో వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ సూపర్ ఫోటో విస్తృతంగా వైరల్ అవుతోంది. వాట్సాప్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. అదే ఇటలీకి చెందిన ప్రసిద్ధమైన ఆహారం పిజ్జా. ఈ పిజ్జా పేరు వెనుక ఉన్న రహస్యాన్ని నిర్వచించడానికి.. ‘గణిత సమీకరణాన్ని’ పేర్కొంటూ ఆ ఫోటోను షేర్ చేసింది. ఆ సమీకరణ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాంతో అది వైరల్ అయ్యింది. ఈ ప్రత్యేక వివరణ కొత్తది కానప్పటికీ.. ‘ది వరల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్’ ట్విట్టర్ హ్యాండిల్ ఇటీవల మళ్లీ షేర్ చేయడంతో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
‘పిజ్జా’కు అదిరిపోయే నిర్వచనం.. ‘డిఫైనింగ్’ పిజ్జా, పోస్ట్‌లోని చిత్రం దాని ‘వాల్యూమ్’ని ‘πz2a’గా పేర్కొంది. అయితే, పిజ్జా మందాన్ని ‘a’గా, వ్యాసార్థాన్ని ‘z’గా తీసుకుంటుని.. దీనిని ‘pi-zz-a’గా అనువదించారు.
ఇది సిలిండర్ ఆకారానికి సంబంధించిన వాల్యూమ్ ఫార్ములా రిప్-ఆఫ్‌గా కనిపిస్తుంది. సాధారణంగా వివిధ రేఖాగణిత బొమ్మలకు వేర్వేరు వాల్యూమ్ సూత్రాలు ఉన్నాయి. ఒక సిలిండర్‌కు ‘πr2h’, ఇందులో ‘r’= వృత్తాకార వ్యాసార్థం, ‘h’ = ఎత్తు. దీనిని అనువదిస్తూ.. చాలా మంది ‘r’, ‘h’ లను వరుసగా ‘z’, ‘a’ లతో పోల్చారు. ఇలా పిజ్జాను ‘πz2a’ గా సంక్షీప్తీకరించి.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నారు.
పిజ్జా చరిత్ర.. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పిజ్జా ఇటలీలోని నేపుల్స్‌లోని పేద వర్గాల్లో ప్రసిద్ధి చెందిన ఫ్లాట్‌బ్రెడ్‌గా ప్రారంభమైంది. చరిత్రలో పిజ్జా సృష్టికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ లేనప్పటికీ.. చరిత్రకారులు ఒక ప్రతిపాదన అయితే చేశారు. అన్ని వంటకాల్లో ప్రధానమైన టమోటా ఉద్భవించిన కాలంలోనే ఇది తయారు చేసి ఉండొచ్చని చెబుతున్నారు.
రీడర్స్ డైజెస్ట్‌లోని ఒక కథనం ప్రకారం.. టమోటాలు పశ్చిమ దేశాల్లో పుట్టినప్పటికీ.. దాదాపు క్రీ.శ 1500 సంత్సరం వరకూ వరకు అవి యూరప్‌కు చేరుకోలేదు. అంటే.. అంతకు ముందు పిజ్జా ఉనికిలోకి వచ్చే అవకాశం లేదన్నమట. దీని ప్రకారం.. 1500 సంవత్సరం తరువాతే పిజ్జా తయారు చేశారు.
ఇక 1799 నాటి ఒక పుస్తకంలో టొమాటో సాస్, చీజ్‌తో కూడిన పిండిగా పిజ్జాను పేర్కొన్నారు. దీని ప్రకారం.. పిజ్జా అప్పటికి కనిపెట్టారని స్పష్టమైంది. RD కథనం ప్రకారం.. 1700ల చివరలో జరిగిన ఇటాలియన్ జనాభా గణన కొంతమంది వ్యక్తులను ‘పిజోలా’లుగా పేర్కొంది. అంటే వీరు నేపుల్స్‌లోని పిజ్జా తయారీదారులట. ఈ వంటకాన్ని ఒక నిర్దిష్ట వృత్తిదారులు మాత్రమే తయారు చేసేవారట. అందుకే వారిని పిజోలా లుగా ప్రస్తావించారు
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..