life style: పీరియడ్స్ సమయంలో ఊరగాయలను ఎందుకు ముట్టుకోకూడదు..?

|

Jun 01, 2022 | 9:03 AM

రుతుక్రమం మొదలైన ప్రతి అమ్మాయిని నెలనెలా వచ్చి పలకరించి వెళ్లే అతిథి పీరియడ్స్.. ఇది అంత ఈజీ మాట కాదు..నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, రక్తస్రావం కారణంగా పీరియడ్స్ వస్తోందంటేనే కాస్త భయంగా ఉంటుంది. కానీ,

life style: పీరియడ్స్ సమయంలో ఊరగాయలను ఎందుకు ముట్టుకోకూడదు..?
Pickles
Follow us on

రుతుక్రమం మొదలైన ప్రతి అమ్మాయిని నెలనెలా వచ్చి పలకరించి వెళ్లే అతిథి పీరియడ్స్.. ఇది అంత ఈజీ మాట కాదు..నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, రక్తస్రావం కారణంగా పీరియడ్స్ వస్తోందంటేనే కాస్త భయంగా ఉంటుంది. కానీ, ఆరోగ్యకరమైన రుతు చక్రం మహిళల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. రుతు చక్రం శారీరక ,మానసిక ఆరోగ్యానికి ముఖ్యమైనది. ఒక ఆరోగ్యకరమైన రుతు చక్రం ఐరన్‌ లోపం, ఆరోగ్యకరమైన గర్భాశయం తిత్తులు లేకుండా నిర్ధారిస్తుంది.

ఇదిలా ఉంటే, ఈ పీరియడ్స్‌ టైమ్‌ అనేది మహిళలకు పెద్ద సవాల్‌లాంటిది..ఆ టైమ్‌లో ఇంట్లోని పూజ గదిలోకి రాకూడదు. దేవాలయాలు, ఇతర కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాలి. ఆమె జుట్టును దువ్వెనతో దువ్వుకోకూడదు. వంట గదిలోకి వెళ్లకూడదు..ఊరగాయలను అస్సలు ముట్టుకోనే వద్దు వంటి పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే, పీరియడ్స్ సమయంలో పచ్చళ్లను ముట్టుకోకపోవడానికి గల కారణం ఏంటి..? ఇది శాస్త్రీయమా..? లేక అపోహమాత్రమేనా..?

వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన శిఖా ప్రసాద్, పీరియడ్స్ సమయంలో ఊరగాయ బాటిల్ చెడిపోయే అవకాశం ఉన్నందున దానిని ముట్టుకోవద్దని తన అమ్మమ్మ చెప్పిన ఆ టీనేజ్ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇది ఆమె కథ మాత్రమే కాదు, భారతదేశంలో చాలా మంది మహిళలు ఇలాంటి పక్షపాతాలు, వైరుధ్యాలకు లోనవుతున్నారు. రుతుక్రమం సమయంలో ఆహారాన్ని తాకడం వల్ల ఆహారం అపవిత్రం అవుతుందని సంప్రదాయంగా నమ్ముతారు. ఈ పురాతన సంప్రదాయం ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. ఊరగాయ, నిలువ పచ్చళ్లను తాకడం వల్ల అవి అపవిత్రం అవుతుందని నమ్ముతారు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న వాస్తవాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

పీరియడ్స్ సమయంలో ఊరగాయ ముట్టుకుంటే పాడవుతుందా?
పాతకాలపు నమ్మకాల ప్రకారం.. పీరియడ్స్ సమయంలో మహిళలు వంటగదిలోకి ప్రవేశించడానికి, ఊరగాయలను తాకడానికి వీల్లేదు., వారు అపవిత్రులని నమ్ముతారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆహారం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా మంది మహిళలు ఇప్పటికీ వంట చేయడం, వంటగదిలోకి ప్రవేశించడం మానేసి, ఆ 4-5 రోజులలో ఏకాంతాన్ని ఆచరిస్తున్నారు. ఇది వాస్తవానికి ఆహారాన్ని ప్రభావితం చేస్తుందా ..? అపరిశుభ్రంగా చేస్తుందా? దీని గురించి సైన్స్ ఏం చెబుతోంది..?

ఇది వాస్తవమా లేక పురాణమా?
ఋతుస్రావం సమయంలో శరీరం నుండి అపరిశుభ్రమైన రక్తం బయటకు ప్రవహిస్తుంది. దాని కోసం పూర్వ కాలంలో మహిళను గుడ్డను వాడేవారు. అందువల్ల పరిశుభ్రతను పాటించే క్రమంలో ఇంట్లోని పెద్దవారు పీరియడ్స్‌లో ఉన్న ఆడవారిని దూరం పెట్టేవారు. అంతేకాదు, ఋతుస్రావం సమయంలో మహిళలు నీరసించి పోతారు కాబట్టి వారికి సరైన విశ్రాంతి తేలికైన, బలమైన ఆహారం అందించాలనే భావంతో కూడా వారిని ఇతరాత్ర పనులకు దూరంపెట్టేవారు. ముఖ్యంగా ఊరగాయలు, నిల్వపచ్చళ్లు వంటివాటి దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. అలా చేస్తే అవి త్వరగా పాడైపోతాయని నమ్మకం. దానివల్ల పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారనేది నమ్మకం. అయితే, ప్రస్తుత కాలంలో సైన్స్‌ బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఆడవారి బహిష్టు కష్టాలకు అనేక సులువైన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యంతో పాటు, బలహీనతను దూరం చేసే మార్గాలు మరోన్నో లభించాయి.

ఇకపోతే, ఊరగాయ చెడిపోవడానికి దారితీసే తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు, సరికాని నిల్వ, బ్యాక్టీరియా/ఫంగస్ అభివృద్ధికి దారితీసే తడి చెంచా వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అంతేకానీ, ఆడవారి పీరయడ్స్‌కి ఊరగాయకు ఎలాంటి కనెక్షన్‌ లేదంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు.