AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తప్పిపోయిన పెంపుడు కుక్క కోసం ఊరంతా ప్రచారం… వినూత్న రీతిలో సాగిన శ్రమకు దక్కిన ప్రతిఫలం..

జంతుప్రియులకు పెంపుడు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా కుక్కలను అమితంగా ఇష్టపడుతుంటారు. వాటిని ఇంట్లోని వ్యక్తిలా అపురూపంగా సాకుతుంటారు. అటువంటి జంతువు తప్పిపోతే ఇక వారి బాధ వర్ణానాతీతమే..తప్పిపోయిన తమ పెంపుడు జంతువు కోసం గుంటూరులోని ఆ కుటుంబం చేయని ప్రయత్నమే లేదు. ఏం చేశారో తెలుసుకుంటే ముక్కున వేలేసుకుంటారు.

Andhra Pradesh: తప్పిపోయిన పెంపుడు కుక్క కోసం ఊరంతా ప్రచారం... వినూత్న రీతిలో సాగిన శ్రమకు దక్కిన ప్రతిఫలం..
Missing Dog
T Nagaraju
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 16, 2024 | 1:11 PM

Share

గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో నివాసం ఉండే మోజెస్ కుటుంబం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాన్ని రెండేళ్ళ నుండి పెంచుకుంటున్నారు. దానికి మ్యాక్స్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం ఈ నెల పదో తేదిన ఇంటిలో నుండి వెళ్లిపోయింది. ఎలా వెళ్లిపోయిందో ఎందుకు వెళ్లిపోయిందో మోజేస్ కుంటుబానికి అంతుచిక్కలేదు. రెండు రోజుల పాటు దాని కోసం ఎదురు చూశారు. అయితే దాని జాడ మాత్రం తెలియలేదు. దీంతో ముందుగా వెళ్లి అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం తమ ప్రయత్నం చేస్తామని చెప్పారు. వెంటనే మున్సిఫల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం కనపడలేదు. లోకల్ టివిల్లో యాడ్ ఇచ్చారు. నగరంలో ప్లెక్స్ లు కూడా వేయించారు. అయినా దాని జాడ దొరకలేదు.

దీంతో వినూత్నంగా ఆలోచించి చిన్న పాంప్లెట్ వేయించారు. కుక్క ఫోటోతో పాటు ఎప్పుడు తప్పిపోయింది ఎంత వయస్సుంది, దాని ఆనవాళ్లు తదితర వివరాలన్నీ పాంప్లెట్ లో పొందుపరిచారు. ఈ పాంప్లెట్స్ ను అన్ని న్యూస్ పేపర్లలో ఉంచి ఇంటింటికి వెళ్లేలా చేశారు. పాంప్లెట్ లో ఫోన్ నంబర్ తో పాటు ఆచూకీ చెప్పిన వారికి పారితోషికం కూడా ఇవ్వబడును అని పేర్కొన్నారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

అయితే పాంప్లెట్ పంచిన రెండు గంటల్లోనే ఫలితం కనిపించింది. స్వర్ణ భారతినగర్ కు చెందిన ఆటో డ్రైవర్ మ్యాక్స్ తనవద్దే ఉందని మోజేస్ కుటుంబానికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అమితానందంతో మోజేస్ స్వర్ణ భారతి నగర్ కు వెళ్లాడు. అక్కడ ఆటో డ్రైవర్ జరిగినదంతా చెప్పాడు. వారం రోజుల క్రితం వర్షం పడుతుండగా మ్యాక్స్ ఇంటిలో నుండి వెళ్లిపోయినట్లు మోజేస్ చెప్పగా అదే రోజు లక్ష్మీ పురంలో ఆటోలో వెలుతుండగా మ్యాక్స్ వెంట కుక్కలు వెంటపడటాన్ని ఆటో డ్రైవర్ జయరాజ్ గమనించాడు. రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగిన మ్యాక్స్ ను వీథి కుక్కలు వెంటపడటాన్ని చూశాడు. వెంటనే మ్యాక్స్ ను వీధి కుక్కల బారి నుండి కాపాడిన జయరాజ్ తన ఆటోలో ఇంటికి తీసుకెళ్లాడు. గత వారం రోజులుగా దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అయితే ఈ రోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే పాంప్లెట్ కనిపించింది. వెంటనే పాంప్లెట్ లోని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తన ఇంటి వద్దకు పిలిపించాడు. ఆ వెంటనే మ్యాక్స్ ను మోజేస్ కి అందించాడు. మోజేస్ చూసిన మ్యాక్స్ కూడా తన స్వంత ఇంటికి వెళ్లినంత సంబరపడిపోయింది. మొత్తం మీద కథ సుఖాంతం అవ్వడంతో అటు మోజేస్, ఇటు జయరాజ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..