దెయ్యం అంటే భయపడే వాళ్ళు చాలా మందే ఉన్నారు.. దెయ్యం భయంతో ఊర్లు ఖాళీచేసి వెళ్లిపోయే జనాలు కూడా ఉన్నారు. ఇక దెయ్యాల పేరు చెప్పుకొని డబ్బులు దండుకునే వాళ్ళు, జనాలను భయపెట్టే వాళ్లు సైతం ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దెయ్యాలు సంబందించిన వీడియోలకు కొదవే లేదు. రకరకాల ఎడిట్స్ తో.. గ్రాఫిక్స్ తో.. ఇదిగో దెయ్యం.. అదిగో దెయ్యం అంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటారు కొందరు. తాజాగా ఓ దెయ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దాంతో అక్కడి స్థానికులు భయంతో వణికిపోయారు. దాంతో ఈ వీడియో పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి దర్యాప్తు మొదలు పెట్టారు.
వారణాసిలో ఓ ఇంటి పై తెల్లటి ముసుగు వేసుకొని ఎవరో తిరగడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో పై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో భేలుపూర్ పోలీసులు అసలు విషయం కనిపెట్టే పనిలో పడ్డారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. కొద్దిరోజుల క్రితం బడి గబీ ప్రాంతంలోని వీడీఏ కాలనీలో దెయ్యం కనిపించిందని ఓ వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారడంతో గందరగోళం నెలకొంది. ఆ వీడియోలో ఓ తెల్లటి ముసుగుతో ఎదో నడుస్తూ కనిపించింది. ఆ తర్వాత.. ఇలాంటి మరో మూడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కొంతమంది స్థానికులు ఈ వీడియో నిజమైంది అంటుంటే.. మరికొందరు ఇది ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు.
बनारस में छतों पर एक सफेद कपड़ा पहने भूत के चलने का वीडियो तेजी से वायरल हो रहा है, चश्मदीदों ने पुलिस से जांच की मांग की है… pic.twitter.com/e8KqvvYIr0
— Banarasians (@banarasians) September 22, 2022
ఈ వీడియో వాస్తవికతను ధ్రువీకరించలేదు
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి