తిరగండి, ఏరుకోండి, తినండి.. పబ్లిక్ పార్కుల్లో పండ్లు, కూరగాయలు పూర్తిగా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!

సాధారణంగా ఏదైనా నగరంలోని పబ్లిక్ పార్కులకు వెళితే పువ్వులు కోయరాదు లేదా పచ్చికపై నడవరాదు అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ, మీరు ఒక పార్కులో నడుస్తూ అక్కడి మొక్కల నుండి తాజా కూరగాయలు, పండ్లను ఫ్రీగా తినగలిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి..సరిగ్గా అలాంటి ఒక వింత పార్క్‌ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఉచితంగా ఆహార భద్రతను అందించాలనే వినూత్న లక్ష్యంతో 2010లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకుంటోంది.

తిరగండి, ఏరుకోండి, తినండి.. పబ్లిక్ పార్కుల్లో పండ్లు, కూరగాయలు పూర్తిగా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!
Andernach Germany

Updated on: Aug 26, 2026 | 8:22 PM

సాధారణంగా ఏదైనా నగరంలోని పబ్లిక్ పార్కులకు వెళితే పువ్వులు కోయరాదు లేదా పచ్చికపై నడవరాదు అనే హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. కానీ, జర్మనీలోని రైన్ నది ఒడ్డున ఉన్న ఆండర్‌నాక్ అనే చారిత్రక పట్టణంలోకి వెళితే మాత్రం అందుకు భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ కూరగాయలు ఉచితంగా కోసుకోవచ్చు అనే బోర్డులు పర్యాటకులను ఆహ్వానిస్తాయి. ప్రపంచంలోనే మొట్ట మొదటి ఎడ్బుల్ సిటీగా గుర్తింపు పొందిన ఈ నగర విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ఏమిటీ ఎడ్బుల్ సిటీ ప్రాజెక్ట్?:

ఆండర్‌నాక్ నగర యాజమాన్యం 2010లో ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నగరంలో కేవలం అందం కోసం మాత్రమే ఉండే పూల మొక్కల స్థానంలో.. ప్రజలకు ఉపయోగపడే పండ్లు, కూరగాయలు, ఔషధ మూలికలను నాటడం ప్రారంభించారు. పబ్లిక్ పార్కులు, ప్రాచీన కోట గోడల పక్కన ఉన్న ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన ఉన్న పచ్చిక బయళ్లలో రకరకాల పంటలను సాగు చేస్తున్నారు.

ఉచితంగా పండ్లు, కూరగాయల సేకరణ:

ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. నగరంలో నివసించే నివాసితులు లేదా బయటి నుండి వచ్చే సందర్శకులు ఎవరైనా సరే, ఈ పబ్లిక్ తోటల్లోకి వెళ్లి తమకు కావలసిన టమోటాలు, క్యాబేజీ, క్యారెట్లు, బాదం, అత్తి పండ్లు, యాపిల్స్ మొదలైనవాటిని రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా తెంపుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వినూత్న ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశాలు:

ఇక్కడ పండించే ఏ పంటకు కూడా రసాయన పురుగుమందులు వాడరు. పూర్తి సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన కూరగాయల రకానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఏడాది 101 రకాల టమోటాలు నాటితే, మరొక ఏడాది బీన్స్ లేదా క్యాబేజీలను ప్రత్యేకంగా పెంచుతారు.

ఈ తోటల నిర్వహణ, సంరక్షణ బాధ్యతలను స్థానిక దీర్ఘకాలిక నిరుద్యోగులకు అప్పగించి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. పట్టణాల్లో ఉండే పిల్లలకు, ప్రజలకు వ్యవసాయం, తాజా ఆహారం, ప్రకృతి ప్రాముఖ్యతపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుంది. పట్టణాలను కేవలం కాంక్రీట్ జంగిల్‌గా మార్చకుండా, పచ్చదనంతో పాటు ప్రజల ఆహార అవసరాలను తీర్చవచ్చని ఆండర్‌నాక్ నగరం ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us