Viral Video: రైలులో జలపాతం సౌకర్యం.. ఏసీ కోచ్‌లో నీటి లీకేజీ వీడియో వైరల్..
సెప్టెంబర్ 9న షేర్ చేయబడిన వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. జబల్‌పూర్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ జబల్‌పూర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తుండగా M-3 కోచ్ సీలింగ్ నుంచి నీరు కారుతున్నట్లు వీడియోలో చూపబడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ వీడియోను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.

కాంగ్రెస్, బీజేపీల మధ్య సెటైర్లు పటాసుల్లా పేలుతున్నాయి. లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఓ రైల్వే వీడియోను పోస్ట్ చేస్తూ.. సెటైర్ తో కూడిన కామెంట్ పెట్టింది. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జబల్‌పూర్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో నీరు లీక్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌పై మండిపడుతున్నారు. సెప్టెంబర్ 9న షేర్ చేయబడిన వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
జబల్‌పూర్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ జబల్‌పూర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తుండగా M-3 కోచ్ సీలింగ్ నుంచి నీరు కారుతున్నట్లు వీడియోలో చూపబడింది.
रील मंत्री जी, क्या बात है!!
आपने तो यात्रियों को ट्रेन में झरने की सुविधा दे दी।
ये अनोखा झरना जबलपुर निज़ामुद्दीन एक्सप्रेस में देखा गया।
लोग यात्रा भी करें और झरने का मजा भी लें।
शानदार, ज़बरदस्त, ज़िंदाबाद pic.twitter.com/1NQvkOYYGh
— Congress (@INCIndia) September 9, 2024
కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ వీడియోను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోకి రైల్వే మంత్రి గారు మీరు నిజంగా అద్భుతం.. మీరు ప్రయాణికులకు రైలులో ప్రయాణిస్తూ జలపాత సౌకర్యం కల్పించారు” అని వ్యంగ్యంగా ఒక కామెంట్ ను ఈ వీడియోకు జత చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




