Viral Video: ఇది చూశారంటే పెట్రోల్ బంకుల్లో నీళ్లు తాగాలంటేనే భయపడిపోతారు.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video: ఈ నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రతిరోజూ వేలాది మంది పెట్రోల్ పంపుల వద్ద నీరు తాగుతారు. వారిలో ఎక్కువ మంది డ్రైవర్లు, కార్మికులు ఉంటారు. వారు ఈ కలుషిత నీటిని తాగి ఉంటే, వారు తీవ్రమైన అనారోగ్యాలకు..

Viral Video: సాధారణంగా ప్రతి పెట్రోల్ పంపుల్లో తాగేనీరు ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ పంపుల్లో తాగునీరు ఏర్పాటు చేయాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం ఏర్పాటు చేసినా నీరు మురికిగా ఉంటున్నాయి. పంపుల్లో వాటర్ ఫిల్టర్‌లను ఏర్పాటు చేస్తారు. కానీ లోపల మాత్రం మురికిగా తయారు అవుతున్నాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో పెట్రోల్ పంప్ లో ఏర్పాటు చేసినది. అక్కడ నీరు తారాగడానికి వెళ్ళిన వ్యక్తి అకస్మాత్తుగా షాక్ అయ్యాడు. అతను వాటర్ కూలర్ తెరిచిన వెంటనే అందులో ఒక బల్లి ఈత కొడుతుండటం చూశాడు. ఇంకా వాటర్ కూలర్ లోపల నీరు చాలా మురికిగా ఉంది.
Viral Video: చూస్తుండగానే చిన్నారిపై కుక్క దాడి.. క్షణాల్లో కాపాడిన తల్లి.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
వీడియోలో ఒక వ్యక్తి నీళ్లు తాగడానికి కూలర్ దగ్గరికి వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మూత తెరిచి చూడగానే లోపల ఉన్న నీటి స్థితి చూసి అతను ఆశ్చర్యపోయాడు. నీళ్లు పూర్తిగా కలుషితమై ఉన్నాయి. అందులో ఒక బల్లి దాగి ఉంది. అతను వెంటనే ఆ దృశ్యాన్ని తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. అందుకే మీరు కూడా పెట్రోల్ పంపుల్లో నీరు తాగుతున్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రమాదంలో పడిపోతారు.
ఈ నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రతిరోజూ వేలాది మంది పెట్రోల్ పంపుల వద్ద నీరు తాగుతారు. వారిలో ఎక్కువ మంది డ్రైవర్లు, కార్మికులు ఉంటారు. వారు ఈ కలుషిత నీటిని తాగి ఉంటే, వారు తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Look at this water- there’s literally a lizard in it
Cab & truck drivers drink this daily, risking bacterial infections, diarrhea, hepatitis, etc.
India is staring at health epidemic as we’ve totally given up on basic food & water safety.
Shouldn’t govt shut down such pumps? pic.twitter.com/cml1aZe0Gr
— Anuradha Tiwari (@talk2anuradha) September 17, 2025
ఇది కూడా చదవండి: Gold Rate: దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.1.25 లక్షలు దాటుతుందా?
అయితే ఇలా అన్ని పెట్రోల్ బంకుల్లో ఉంటాయని కాదు.. కొన్ని బంకుల్లో మాత్రమే యజమానుల నిర్లక్ష్యం కారణంగా ఇలా ఉంటున్నాయి. అయితే మీరు ఏదైనా రోడ్ సైడ్‌లో గానీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఉండే వాటర్ ఫిల్టర్ వద్ద నీళ్లు తాగే ముందు కాస్త గమనించడం చాలా ముఖ్యం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




