Viral Video: ‘జీవితం మహా చెడ్డది భయ్యా’.. వర్షంలో తడుస్తూ తింటున్న పేదవాడు.. గుండె బరువెక్కే వీడియో!
జీవితం అందరికీ ఒకేలా ఉండదు.. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ.. చిన్న చిన్న కష్టాల గురించి ఫిర్యాదు చేసేవారు కొందరైతే..
జీవితం అందరికీ ఒకేలా ఉండదు.. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ.. చిన్న చిన్న కష్టాల గురించి ఫిర్యాదు చేసేవారు కొందరైతే.. తమపై ఆధారపడిన కుటుంబాన్ని పోషించేందుకు ఎండ, వాన అనేది తేడా లేకుండా ఇబ్బందులు పడుతూ బ్రతుకు జట్కా బండిని నడిపేవారు మరికొందరు. ఇక పేదవారి గురించయితే చెప్పనక్కర్లేదు.. ఒక పూట అన్నం కోసం వారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.. అలా వచ్చిన ఫుడ్.. ఒకవేళ వారికి నోటి దాకా అందకపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. తాజాగా ఇంటర్నెట్‌లో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అది చూశాక మీ గుండె బరువెక్కడం ఖాయం.
పైనుంచి కుండబోత వర్షం కురుస్తోంది.. వర్షం కురుస్తున్నప్పటికీ.. ఓ వ్యక్తి ఒక స్కూటర్‌కు దగ్గరగా కూర్చుని భోజనం చేస్తున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఆ వర్షంలో తడుస్తున్నా.. అతడు పట్టించుకోవట్లేదు.. కానీ అతడికి దొరికిన ఆహారాన్ని మాత్రం వర్షం నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బాగా ఆకలితో ఉన్న అతడు.. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి పట్టించుకోకుండా.. తన కడుపు నింపుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
बड़ी शिकायत थी तुझसे ऐ ज़िन्दगी लेकिन जब ये मंजर देखा तो सारी शिकायत छोड़ दी हमने ?? pic.twitter.com/gJ651OSCJn
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 11, 2022
కాగా, ఈ 30 సెకన్ల వీడియోను ‘జిందగీ గుల్జార్ హై’ అనే ట్విట్టర్ ఖాతా పోస్ట్ చేసింది. దీనిని చూశాక నెటిజన్లు బరువెక్కిన హృదయాలతో కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇదొక తమాషా ప్రపంచం.. ఒకపక్క ఒకరికి ఆహారం తినేందుకు సరైన జాగ లేకపోగా.. మరోపక్క మరొకరు రుచి లేదని.. ఆహారాన్ని పడేస్తున్నారు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘జీవితంలో మీకు లభించిన ప్రతీదానికి కృతజ్ఞతతో ఉండాలి’ అని మరొకరు రాసుకొచ్చారు.
అన్నం పరబ్రహ్మ pic.twitter.com/XVlqXdyw8s
— Sr Babu (@SrAslam4) September 11, 2022
Humara desh aaj b bahut peeche hai Bahut buri baat hai hum logo k liye k humare aas pass aaj b aise log bhooke pet soo rahe hai ???
— sahil singh (@sahilsi58419517) September 11, 2022