Viral: ఏం ధైర్యంరా వాడిది.. కాటేసిన పాముతోనే ఆస్పత్రికెళ్లాడు.. చివరికి ఏం జరిగిందంటే?

|

Apr 14, 2023 | 8:00 PM

పాము కాటుకు గురైన ఓ వ్యక్తి.. చికిత్స కోసం ఏకంగా పాముతోనే ఆసుపత్రిలో దర్శనమియ్యడంతో వైద్యులు షాక్ తిన్నారు. ఓ చేయిపై పాము కాటు వేయగా..

Viral: ఏం ధైర్యంరా వాడిది.. కాటేసిన పాముతోనే ఆస్పత్రికెళ్లాడు.. చివరికి ఏం జరిగిందంటే?
Viral
Follow us on

పాము కాటుకు గురైన ఓ వ్యక్తి.. చికిత్స కోసం ఏకంగా పాముతోనే ఆసుపత్రిలో దర్శనమియ్యడంతో వైద్యులు షాక్ తిన్నారు. ఓ చేయిపై పాము కాటు వేయగా.. మరో చేతితో ఆ పామును పట్టుకుని వచ్చాడు సదరు వ్యక్తి.. దీంతో భయపడుతూనే వైద్యులు అతడికి చికిత్స చేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

జాజ్‌పూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి కాటేసిన పాముతో సహా వచ్చాడు ఓ వ్యక్తి. స్థానిక చత్రపదలోని దసరత్పుర ఏరియాకు చెందిన శ్రీమంతా మల్లిక్‌ను బుధవారం ఓ పాము కాటేసింది. ఇంతకీ ఆ పాము విషపూరితమైనదో.. కాదో.. తెలియక.. ఓ చేతితో దాన్ని పట్టుకుని ఏకంగా ఆసుపత్రికి వచ్చేశాడు.

కాగా, అతడికి చికిత్స అందించిన డాక్టర్లు.. ఆ తర్వాత స్నేక్ హెల్ప్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించి.. విషసర్పాన్ని రక్షించారు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడ సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి