Viral Video: నీటిలో తేలుతున్న నల్లటి ఆకారం.. ఏంటని చూడగా దెబ్బకు ప్యాంట్ తడిచిపోయింది..

మన దేశంలో కాదు గానీ.. విదేశాల్లో వీకెండ్ వస్తే చాలు.. కొంతమంది స్థానికంగా ఉండే సరస్సుల దగ్గరకు ఫిషింగ్ కోసం వెళ్తుంటారు. అక్కడ అతడికి బోలెడన్ని చేపలు చిక్కుతాయని ఊహిస్తే..

Viral Video: నీటిలో తేలుతున్న నల్లటి ఆకారం.. ఏంటని చూడగా దెబ్బకు ప్యాంట్ తడిచిపోయింది..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: May 24, 2023 | 1:22 PM

మన దేశంలో కాదు గానీ.. విదేశాల్లో వీకెండ్ వస్తే చాలు.. కొంతమంది స్థానికంగా ఉండే సరస్సుల దగ్గరకు ఫిషింగ్ కోసం వెళ్తుంటారు. అక్కడ అతడికి బోలెడన్ని చేపలు చిక్కుతాయని ఊహిస్తే.. అక్కడ జరిగింది మరొకటి. చుట్టూ ఆహ్లాదకరంగా ఉన్న ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నీళ్లలో చిన్న అలజడి చెలరేగింది. ఏంటని చూడగా.. ఒక్కసారిగా బోటులో షికారు చేస్తున్న వ్యక్తి గుండె ఆగినంత పనైంది. నీటిలో నల్లటి ఆకారం తేలుతూ కనిపించింది. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా.? ఓ భారీ అనకొండ. మీరు కేవలం సినిమాల్లో చూడటమే తప్ప.. ఇంతటి పెద్ద అనకొండను ఎప్పుడూ చూసి ఉండరు.

ఓ వ్యక్తి సరస్సులో చేపలు పట్టేందుకు వెళ్లగా.. అతడి పడవ పక్కన ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అత్యంత సమీపంలో నుంచి ఆ అనకొండ ముందుకు సాగిపోయింది. తన కెమెరాతో దాన్ని బంధించాడు ఈ వ్యక్తి. ఇక ఈ వీడియోను ‘వావ్ టెర్రిఫైయింగ్’ అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 6.7 మిలియన్ వ్యూస్.. 66 వేల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘హాలివుడ్ సినిమాలో సీన్ చూసినట్టు ఉందని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘పాపం.. ఆ బోటులో ఉన్న వ్యక్తి ఎంత భయపడ్డాడో’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘అది ఏదైనా జాతికి చెందిన చేప అయ్యి ఉండొచ్చునని’ ఇంకొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి అది నిజంగా అనకొండా లేక ఏదైనా జాతికి చెందిన చేప అనేది మీరే చెప్పాలి. లేట్ ఎందుకు వీడియోపై ఓ లుక్కేయండి.