మన దేశంలో సాధారణంగా ఎన్నో రకాల డాన్సులు చూసి ఉంటాము. ఒక్కో రాష్ట్రంలోని ప్రజలు.. ఒక్కోలా నృత్యప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఆ డాన్సులకు పదేళ్లు, ఇరయ్యేళ్లు, మహా అయితే వందేళ్లు చరిత్ర ఉండొచ్చు.. కానీ.. ఆరు వందల ఏళ్ల నుంచి సంప్రదాయంగా వస్తున్న డాన్సు ఒకటి ఉందంటే ఆశ్చర్యపోకతప్పదు. ఆ డాన్సు ఏంటో?.. దాని కథేంటో ఒక్కసారి చూసేద్దాం…
ఒక్కో దేశంలో ఒక్కో రకరమైన సాంస్కృతిక సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని విభిన్న సంప్రదాయాలు, కళలు ఆయా ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేకను కలిగి ఉంటాయి. ఆయా దేశాల్లో ఉన్న విద్య, వైజ్ఞానికి సాంస్కృతిక కళలు, శాస్త్రలను ప్రోత్సహిస్తూ కనుమరుగవ్వకుండా కాపాడేందుకు కృషి చేస్తోంది యునెస్కో. దానిలో భాగంగా.. 600 ఏళ్ల నాటి ఓ అద్భుత అనితర సాధ్యమైన నృత్య కళకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకుంది యునెస్కో. ఆ నృత్యకళను ఎవరైనా కళ్లార్పకుండా చూడాల్సిందే. అంతలా కట్టిపడేస్తుంది ఆ డాన్స్. ఈ కళను ప్లయింగ్ మెన్ డ్యాన్స్‌గా వ్యవహరిస్తారు. మెక్సికో, మధ్య అమెరికాలో తూర్పు రాష్ట్రమైన వెరాక్రూజ్‌లోని టోటోనాక్ సముహ ప్రజలు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. దాన్ని సంతానోత్పత్తి డ్యాన్స్‌గా పిలుస్తారు. ఆచార వ్యవహారాలు, ప్రకృతి పట్ల వారికున్న గౌరవం, సామరస్యతను తెలియజేసేందుకు చేసే ఫెర్టిలిటీ డ్యాన్స్ ఇది అంటారు.
దీనికి సంబంధించిన వీడియోను ఓసారి పరిశీలిస్తే.. ఈ నృత్యం చేసే సమయంలో కొందరు పురుషుల బృందం ఓ పొడవాటి స్థంభంపై గుంపుగా కూర్చున్నారు. అందులోని ఓ వ్యక్తి.. స్థంభంపై బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఒక విధమైన సాధనంతో ఊదుతూ.. గాల్లో డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత.. ఆ వ్యక్తి సెంటర్ పొజిషన్‌లో కూర్చోగానే మిగతా వ్యక్తులు తలకిందులుగా.. ఆ స్థంభం చుట్టూ వేలాడుతూ.. నలు దిశల్లో తిరుగుతున్నారు. అలాగే.. డాన్స్ చేస్తూ క్రమంగా కిందకి దిగిపోయారు.
అద్భుతంగా కనువిందు చేస్తున్న ఈ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. అందుకే.. ఈ డాన్స్‌కు సంబంధించిన వీడియోను యునెస్కో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. వారు ఏవిధంగా నృత్యం చేశారో వివరించింది. వీడియోను చూసి నెటజిన్లు ఫిదా అయిపోతున్నారు. కళ్లార్పకుండా చూసేస్తున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేసుకోండి.