Watch Video: అరటిపండే కదా అని గుటుక్కున మింగేశాడు.. కట్ చేస్తే.. దెబ్బకు కళ్లు గిర్రున తిరిగాయ్..

|

May 02, 2023 | 8:04 AM

అరటి పండును ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొందరైతే డజన్ల కొద్ది అరటిపండ్లు లాగించేస్తుంటారు. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రజలు అరటిపండును ఇష్టంగా తింటారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి బాగా ఆకలేసి.. అరటి పండు తిన్నాడు. అయితే, అతను తిన్నది అలాంటి ఇలాంటి అరటి పండు కాదు.

Watch Video: అరటిపండే కదా అని గుటుక్కున మింగేశాడు.. కట్ చేస్తే.. దెబ్బకు కళ్లు గిర్రున తిరిగాయ్..
Costly Banana
Follow us on

అరటి పండును ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొందరైతే డజన్ల కొద్ది అరటిపండ్లు లాగించేస్తుంటారు. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రజలు అరటిపండును ఇష్టంగా తింటారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి బాగా ఆకలేసి.. అరటి పండు తిన్నాడు. అయితే, అతను తిన్నది అలాంటి ఇలాంటి అరటి పండు కాదు. చాలా అరుదైన, అమూల్యమైన, అత్యంత విలువైన అరటి పండు. అవును, ఆ అరటి పండు విలువ అక్షరాలా రూ. 98 లక్షలు ఉంటుంది. అలాంటి అరటి పండును ముందూ వెనుకా ఆలోచించకుండా గుటుక్కున మింగేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని లీమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మ్యూజియంలో గోడపై ఒక పండిన అరటిపండును కళాఖండంగా అమర్చారు. ఇది ప్రసిద్ధ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ యొక్క కళాకృతిలో భాగం. దానిని నల్లటి టేపుతో తెల్లటి గోడకు అతికించారు. ఈ కళాకృతికి ‘ది కమెడియన్’ అని పేరు పెట్టారు.

ఇవి కూడా చదవండి

అయితే, కొద్ది రోజుల క్రితం విద్యార్థి నోహ్ హుయెన్-సూ మ్యూజియం సందర్శనకు వచ్చాడు. ఆ క్రమంలో మ్యూజియంలోని వస్తువులను పరిశీలించాడు. ఆ సమయంలో గోడకు వేలాడుతున్న అరటిపండును గమనించాడు. అప్పటికే ఆకలి మీదున్న ఆ కుర్రాడు.. ఏమాత్రం ఆలోచించకుండా అరటి పండును తినేశాడు. పైగా తిన్న తరువాత అరటి పండు తొక్కను యధావిధిగా స్టిక్కర్ అతికించి పెట్టాడు.

ఈ దృశ్యాన్నంతా అతని స్నేహితులు ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కాగా, మ్యూజియం సిబ్బంది ఆ అరటి తొక్కను తొలగించి, అదే స్థలంలో కొత్త అరటిపండును పెట్టింది. అయితే, నోహ్ చేసిన అతనికి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. ఈ కళాకృతి ఖరీదు 12,000 యూఎస్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 98 లక్షలు.

ఇదే అంశంపై విద్యార్థిని ప్రశ్నించగా.. మ్యూజియం సందర్శన సమయంలో తాను అల్పాహారం చేయలేదని, బాగా ఆకలిగా ఉండటంతో ఆ అరటి పండును తిన్నానని చెప్పుకొచ్చాడు. అదృష్టావశాత్తు.. మ్యూజియం ఆ విద్యార్థికి ఎలాంటి పరిహారం విధించబోమని ప్రకటించింది. సంబంధిత కళాకారుడి సూచన మేరకు.. అరటి తొక్క స్థానంలో మరో అరటి పండును ఏర్పాటు చేశారు మ్యూజియం సిబ్బంది.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.