AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోమాలు నిక్కపొడుచుకునే వీడియో..దేశభక్తిని చాటుకున్న దివ్వాంగుడు..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తున్నవారంతా ఒకింత భావోద్వేగానికి గురవుతున్నారు. నిజంగా ఆ యువకుడు చేసిన విన్యాసానికి ప్రతి ఒక్కరూ కరతాళ ధ్వనులతో ప్రశంసిస్తున్నారు. ఈవీడియో ప్రతి భారతీయుడి గుండెను..

Viral Video: రోమాలు నిక్కపొడుచుకునే వీడియో..దేశభక్తిని చాటుకున్న దివ్వాంగుడు..
Divyangjan
Amarnadh Daneti
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 17, 2022 | 3:45 PM

Share

Viral News: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్తు దేశం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంది. ప్రతి ఒక్కరూ తమలో దేశభక్తి చాటుతూ.. ఇళ్లపై త్రివర్ణపతకాన్ని రెపరెపలాడించారు. వాహనాలకు జాతీయ జెండాలు కట్టుకుని జైహింద్ అంటూ నినదించారు. ఒక్కోక్కరూ ఒక్కో రకంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ.. ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తున్నవారంతా ఒకింత భావోద్వేగానికి గురవుతున్నారు. నిజంగా ఆ యువకుడు చేసిన విన్యాసానికి ప్రతి ఒక్కరూ కరతాళ ధ్వనులతో ప్రశంసిస్తున్నారు. ఈవీడియో ప్రతి భారతీయుడి గుండెను హత్తుకుంటోంది. మనలో దేశభక్తిని మరింత రెట్టింపు చేస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందనుకుంటున్నారా..

రెండు కాళ్లు లేని ఓ దివ్వాంగుడు భారత జాతీయ జెండాలో ఉన్న రంగులు, మధ్యలో అశోక చక్రం ఉన్న టీషర్టు వేసుకుని.. ఎవరి సహాయం లేకుండా జెండా స్తంభంపైకి ఎక్కి తానే త్రివర్ణపతాకంలా ఊగుతూ కన్పించాడు. ఈవీడియో చూసిన వారంతా ఈ దివ్యాంగుడికి సెల్యూట్ చేస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ.. ఓ దివ్యాంగుడు తనలో దేశభక్తిని చాటుతూ.. ప్రజలందరి దృష్టిని ఆకర్షించాడు. త్రివర్ణ పతకాన్ని పోలీన టీషర్టు ధరించి, జెండా స్తంభం ఎక్కిన తర్వాత అతడు చేసిన విన్యాసం అందరితో శభాష్ అనిపించుకుంటోంది. నెటిజన్ల అందరి హృదయాలను ఈవీడియో హత్తుకుంది. కేవలం 13 సెకన్ల నిడివి ఉన్న ఈవీడియో క్లిప్ చూసిన వారంతా దీనిని లైక్ చేస్తున్నారు. లక్షలాది మంది ఇప్పటివరకు ఈ దృశ్యాన్ని వీక్షించారు. దివ్యాంగుడి స్ఫూర్తికి, అతడిలోని దేశభక్తికి నెటిజన్లు జయహో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..