Watch: బైకర్‌ను వెంబడించి దాడి చేసిన ఖడ్గమృగం.. షాకింగ్‌ వీడియో చూస్తే

ఈ ఘటనలో కమ్రూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాకు చెందిన 37 ఏళ్ల సద్దాం హుస్సేన్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఖడ్గమృగం బయటకు వచ్చింది.

Watch: బైకర్‌ను వెంబడించి దాడి చేసిన ఖడ్గమృగం.. షాకింగ్‌ వీడియో చూస్తే
Rhino Chasing Biker

Updated on: Sep 30, 2024 | 2:12 PM

అడవి జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. మరికొన్ని భయబ్రాంతులకు గురి చేసేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగ్గుర్పొడిచేవిగా ఉంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఒక వీడియో వైరల్‌ అవుతోంది. అడవిలో ఖడ్గమృగం కంటపడిన ఓ వ్యక్తికి ఏం జరిగిందో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అయితే, ఈ వీడియో అస్సాం రాష్ట్రానికి చెందినగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అస్సాంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. మోరిగావ్‌ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఆదివారం ఓ బైకర్‌పై ఖడ్గమృగం దాడి చేసింది. ఈ ఘటనలో కమ్రూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లాకు చెందిన 37 ఏళ్ల సద్దాం హుస్సేన్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘వన్యప్రాణుల అభయారణ్యం నుంచి ఖడ్గమృగం బయటకు వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఇంటర్‌నెట్‌ లో వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. అడవులు అంతరించి పోవటం కారణంగానే తరచూ అడవి జంతువులు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయంటున్నారు. ఆహారం, నీరు దొరకని పరిస్థితుల్లో అవి మనుషులపై దాడికి పాల్పడుతున్నాయంటున్నారు. ఇలా చాలా మంది వీడియోపై తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us