Viral: ఒక్క ప్రకటనతో ‘బాయ్‌కాట్ ఓయో’ అనేస్తున్నారే.. ఇంతకీ అసలు కథ తెలిస్తే షాకే

క్రియేటివిటీని ఉపయోగించానని అనుకున్న ఓయో.. అడ్డంగా బుక్కయ్యి.. విమర్శల పాలయ్యింది. మతపరమైన మనోభావాలను ఓయో దెబ్బ తీసిందని.. నెటిజన్లు ట్విట్టర్ లో 'బాయ్ కాట్ ఓయో' అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Viral: ఒక్క ప్రకటనతో బాయ్‌కాట్ ఓయో అనేస్తున్నారే.. ఇంతకీ అసలు కథ తెలిస్తే షాకే
Oyo

Updated on: Feb 21, 2025 | 8:57 PM

క్రియేటివిటీ ఉండొచ్చు.. కానీ ఆ క్రియేటివిటీ లిమిట్స్ దాటకూడదు. ఇదే రీతిలో యాడ్ అని చెప్పి.. లైట్‌గా ఏకంగా లైన్ మొత్తాన్ని దాటేసింది ఓయో హోటల్స్. దీంతో ఎక్స్‌లో ‘బాయ్‌కాట్ ఓయో’ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండింగ్‌ అవుతోంది. కుంభమేళా సందర్భంగా ఓయో సంస్థ ఇచ్చిన ఓ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో ‘దేవుడు అన్ని చోట్లా ఉంటాడు. అలాగే ఓయో కూడా’ అని పేర్కొనడమే ఇందుకు కారణం. దీంతో నెటిజన్లు దేవుడితో పోల్చడమేంటని ఓయో యాజమాన్యంపై మండిపడుతున్నారు. అలాగే హిందూ సంఘాల ప్రతినిధులు కూడా విరుచుకుపడుతున్నారు. ఓయోను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇది చదవండి: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో

ఇవి కూడా చదవండి

తమ ప్రకటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఓయో సంస్థ యాజమాన్యం దిగొచ్చింది. తాము ఇచ్చిన ప్రకటన కేవలం దేశంలోని ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తప్పితే.. ఏ మతాన్ని ఉద్దేశించి కాదని.. ఎలాంటి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడానికి కాదని స్పష్టం చేసింది.

ఇది చదవండి: భారత్‌లో ‘టెస్లా’ కార్లు ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి