AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమిపై నడిచే చేప.. నీళ్లు లేకున్నా బతుకుతుంది.. దీన్ని రహస్యాలు తెలిస్తే..

చేప అంటే నీటిలోనే ఉంటుంది.. కాసేపు ఒడ్డుకు చేరితే ప్రాణాలు వదులుతుంది. కానీ ఒక చేప మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.. నీరు లేకపోయినా గంటల తరబడి దర్జాగా గాలి పీలుస్తుంది.. చెరువు ఎండిపోతే నేలపై నడుచుకుంటూ వెళ్లి మరో నీటి కుంటను వెతుక్కుంటుంది. కవ్వళ్లు చేపగా పిలిచే ఈ జీవికి గల వింత శక్తుల వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భూమిపై నడిచే చేప.. నీళ్లు లేకున్నా బతుకుతుంది.. దీన్ని రహస్యాలు తెలిస్తే..
Kawai Fish Survives On Land Without Water
Krishna S
|

Updated on: Oct 03, 2026 | 4:54 PM

Share

ఎంతటి కష్టమైన పరిస్థితులనైనా తట్టుకుని నిలబడేవారిని పోల్చేందుకు కవ్వళ్లు చేప ప్రాణం అనే నానుడి వాడుతుంటారు. చేపలు నీటిని విడిచి నేలపై పడితే నిమిషాల్లో ప్రాణాలు కోల్పోవడం సహజం. కానీ ఈ కవ్వళ్లు చేప మాత్రం నీరు లేని పొడి నేలపై సైతం గంటల తరబడి ఎంచక్కా జీవిస్తుంది. సాధారణ నీటి జీవికి ఈ అసాధారణ శక్తి ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యాలు ఏమిటి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. సాధారణంగా చేపలు తమ మొప్పల ద్వారా నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి. నీటి నుంచి బయటకు రాగానే మొప్పలు ఒకదానికొకటి అతుక్కుపోయి, గాలిలోని ఆక్సిజన్‌ను గ్రహించలేక ఊపిరాడక చనిపోతాయి. అయితే ఈ చేపలలో ఈ ప్రక్రియ పూర్తిగా భిన్నం. వీటి తల భాగంలో మొప్పల వెనుక భాగంలో ఒక ప్రత్యేక శ్వాసకోశ వ్యవస్థ ఉంటుంది. దీనిని శాస్త్రీయంగా లాబిరింథైన్ ఆర్గాన్ లేదా అదనపు శ్వాస అవయవం అంటారు. ముడుతలు పడిన సంక్లిష్టమైన వల లాంటి ఈ నిర్మాణం వాతావరణంలోని గాలిని నేరుగా పీల్చుకుని, ఆక్సిజన్‌ను నేరుగా రక్తంలోకి సరఫరా చేయగలదు. అందుకే నీటిలోంచి బయటకు తీసినప్పటికీ ఇది చాలాసేపు ప్రాణవాయువును పీల్చుకుంటూ జీవించగలుగుతుంది.

నేలపై నడవగల వాకింగ్ పర్చ్

కేవలం శ్వాస తీసుకోవడమే కాకుండా నేలపై ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించే అరుదైన నైపుణ్యం కూడా దీని సొంతం. ఈ చేప చర్మం, మొప్పల లోపలి భాగం ఎక్కువ సమయం తేమగా ఉండేలా రూపొందింది. ఆ తేమ ఆవిరి కానంత వరకు ఇది బయట గాలి పీల్చుకుంటూ బతికే ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో తడి గడ్డిపై సుదీర్ఘ దూరం ప్రయాణించగలదు. నేలపై పడినప్పుడు ఇది నిశ్చలంగా ఉండదు. బలంగా ఉండే మొప్పల కవచాలు, కండరాలతో కూడిన రెక్కల ఆధారంతో నేలపై పాకుతూ ముందుకు కదులుతుంది.

ఏదైనా చెరువు లేదా కుంట ఎండిపోయినప్పుడు, నేలపై పాకుతూ వెళ్లి పక్కనే ఉన్న మరో నీటి వనరును వెతుక్కుంటుంది. ఈ కారణంగానే ఇంగ్లీషులో దీనిని వాకింగ్ పర్చ్ అని పిలుస్తారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత శరీర నిర్మాణం, పరిణామ క్రమంలో అలవడిన అనుకూలత వల్లనే కొయి చేప అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మృత్యువును జయించి బతుకుతోంది.

Follow Us