వీడు మనిషా మృగమా..! ఆహారం కోసం ఆశగా నోరు తెరచిన హిప్పో… వీడేం చేశాడో తెలిస్తే తిట్టి పోస్తారు

|

Jul 10, 2024 | 6:25 PM

కొంతమంది వినోదం కోసం అమాయక జంతువులను హింసించి చంపేస్తున్నారు. చాలా మంది జంతువులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఏనుగు తినే దానిలో బాంబ్ పెట్టిన ఘటన ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే.. తాజాగా నోరు తెరిచి ఆహారం అడిగిన మూగ జీవి నోట్లో ప్లాస్టిక్ కవర్ విసిరిన ఓ పర్యాటకుడు.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

వీడు మనిషా మృగమా..! ఆహారం కోసం ఆశగా నోరు తెరచిన హిప్పో... వీడేం చేశాడో తెలిస్తే తిట్టి పోస్తారు
Viral Video
Follow us on

మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు. రోజు రోజుకీ సాటి మనిషి పట్ల మాత్రమే కాదు నోరు లేని మూగ జీవుల మీద కూడా జాలి దయ అన్నది లేకుండా ప్రవర్తిస్తూ తనలోని రాక్షస గుణాన్ని ప్రదర్శిస్తున్నాడు. కొంతమంది వినోదం కోసం అమాయక జంతువులను హింసించి చంపేస్తున్నారు. చాలా మంది జంతువులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ఏనుగు తినే దానిలో బాంబ్ పెట్టిన ఘటన ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే.. తాజాగా నోరు తెరిచి ఆహారం అడిగిన మూగ జీవి నోట్లో ప్లాస్టిక్ కవర్ విసిరిన ఓ పర్యాటకుడు.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

సఫారీకి వెళ్లిన పర్యాటకులు ఓ హిప్పోపొటామస్ నోటిలోకి ప్లాస్టిక్ బ్యాగ్ విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సఫారీలో ఉన్నప్పుడు.. పర్యావరణం ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది. అయితే విహార యాత్రకు వెళ్ళిన ఓ పర్యాటకుడు తన దగ్గరకు వచ్చిన నీటి ఏనుగు నోటిలోకి ప్లాస్టిక్ బ్యాగ్ విసిరిన వీడియో వైరల్‌గా మారడంతో నెట్టింట్లో తీవ్ర దుమారం రేగింది. అడవి జంతువుకు మద్దతుగా నెటిజన్లు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు బాధ్యులను అరెస్టు చేయాలని అధికారులను అభ్యర్థించారు. పశ్చిమ జావాలోని బోగోర్‌లోని సఫారీ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధ్యుల కోసం అధికారులు వెతుకుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

చాలా మంది దృష్టిని ఆకర్షించిన ఒక వీడియోలో ఒక హిప్పో నీటిలో ఒడ్డున తిరుగుతూ ఉంది. అటుగా వెళ్తున్న పర్యాటకుల కారు చూసి ఆశగా నోరు విశాలంగా తెరిచి ఉంది. కారులో ఉన్న ఒక పర్యాటకుడు నీటి ఏనుగుకి క్యారెట్ తినిపించడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో అదే కారులో ఉన్న మరొక పర్యాటకుడు తెరిచిన హిప్పో నోటిలోకి ప్లాస్టిక్ సంచిని విసిరాడు. ఆశ్చర్యకరంగా నీటి ఏనుగు అది ఏదో తినే వస్తువు అనుకుని నమలడం ప్రారంభించింది.

ఈ పర్యాటకుడి కోసం కారు లైసెన్స్ ప్లేట్ ఆధారంగా వెదకడం మొదలు పెట్టారు. బాధ్యత లేని అతడు బహిరంగ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ వ్యక్తి వెళ్ళిన వాహనం లైసెన్స్ ప్లేట్‌ను తాము గుర్తించాము అని పార్క్ ప్రతినిధి అలెగ్జాండర్ జుల్కర్‌నైన్ తెలిపారు. అభయారణ్యంలోని జంతువులన్నీ వన్యప్రాణుల చట్టం ద్వారా రక్షించబడుతున్నందున ఇలాంటి పనులు చట్టపరమైన చర్యలు తీసుకునేలా దారితీస్తుందని అలెగ్జాండర్ చెప్పారు. హిప్పోను పరీక్షించామని, ఆరోగ్యంగా ఉందని ఆయన తెలిపారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..