Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ కాలి రెండో వేలు పెద్దదిగా ఉందా..? అయితే స్వభావం ఇదే

కాలి వేళ్లను బట్టి మనుషులను అంచనా వేయవచ్చు. ఆ వ్యక్తి ధైర్యవంతుడా లేదంటే తెలివైన వ్యక్తా అనే విషయం కూడా చెప్పొచ్చు. వేళ్ల పొడవును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చట. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి....

Personality Test:  మీ కాలి రెండో వేలు పెద్దదిగా ఉందా..? అయితే స్వభావం ఇదే
Second Toe
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 10, 2024 | 6:11 PM

కాలి వేళ్లను బట్టి మనుషులు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో చెప్పేయవచ్చట. వారి మనస్తత్వం.. ఇతరులతో మెలిగే విధానం, పిరికి వ్యక్తా, ధైర్యవంతుడా.. జీర్ణ వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుంది ఇలా బోలెడు అంశాలపై ఓ అంచనాకు రావొచ్చట. కాలి బొటనవేలు.. మిగతా ఫింగర్స్ కంటే పెద్దదిగా ఉంటే.. వారు చాలా షార్ప్‌గా ఉంటారట. ఎక్కువగా క్రియేటివ్‌గా ఆలోచిస్తూ.. ఎలాంటి చిక్కు ప్రశ్నకైనా ఈజీగానే పరిష్కారం కనిపెడతారట. బొటన వేలు చిన్నగా ఉన్నవారు.. ఏ పని చేసినా సమర్థవంతంగా వ్యవహరిస్తారట. కచ్చితత్వంతో ముందుకు సాగుతారట. ఏకకాలంలో పలు రకాల పనులు చక్కబెట్టగల తత్వం వీరి సొంతం. తమ స్మార్ట్‌నెస్‌తో ఇతరులను ప్రభావితం చేయగలరు.

మహిళల రెండో వేలు పొడవుగా ఉందనుకోండి.. వారు..  భర్తను డ్యామినేట్ చేస్తారట. అంతేకాదు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంది..  ఎదిగే ప్రతి అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటారట.  అహంకారం పాళ్లు మాత్రం కూసింత ఎక్కువ.

మూడవ వేలు పెద్దదిగా ఉన్న వ్యక్తులు…  చాలా తెలివితో వ్యవహరిస్తూ ఉంటారు. అంతే ఏ పని చేసినా పూర్తి శక్తితో ముందుకు సాగుతారు. తమ తెలివితేటలకు ఎప్పటికప్పుడు సానబెడుతూ ఉంటారు. చాలా పట్టుదలతో, కచ్చితత్వంతో ఏ పనినైనా కంప్లీట్ చేస్తారు. వీరిలో ప్రతికూల అంశం ఏంటంటే… పనిలో పడితే కుటుంబాన్ని కూడా మర్చిపోతారు. అది మూడో వేలు పొట్టిగా ఉంటే…  వారు జీవితాన్ని బిందాస్‌గా ఎంజాయ్ చేస్తారు.

నాలుగో వేలు పొడవును బట్టి వారు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్‌ను లెక్కబెట్టవచ్చు. ఈ వేలు వంకరగా ఉంటే వారి రిలేషన్‌షిప్ అంత ఆనందకరంగా ఉండదు. ఫ్యామిలీ లైఫ్ అసంతృప్తిగా సాగుతూ ఉంటుంది. కాకపోతే వీరు ఎదుటి వాళ్లు చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వింటారు. ఇతరుల సమస్యల్లో అదే పనిగా జోక్యం చేసుకుంటారు. నాలుగో వేలు చిన్నగా ఉన్నవారు ఫ్యామిలీ, రిలేషన్స్ మినహా మిగతా అన్ని విషయాలకు ప్రాధాన్యమిస్తారు.

ఇక చిటికెన వేలు మరీ చిన్నగా ఉంటే చైల్డిష్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. రెస్పాన్సిబులిటీస్ తీసుకోడానికి ఆసక్తి చూపరు. ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటారు. చిటికెన వేలు నాలుగో వేలు మరీ అతుక్కుని ఉంటే, వీరు చాలా బిడియాన్ని కలిగి ఉంటారు. బాధ్యతలకు కూడా దూరం. అదే చిటికెన వేలు నాలుగో వేలికి దూరంగా ఉంటే, వారు సాహసాలను ఇష్టపడతారు. మాటల్లో చమత్కారం ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌