Viral Video: బీభత్సం సృష్టించిన వర్షం.. రైళ్ల పట్టాలపై చేపలు..

వర్షం కాలం మొదలైంది. కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం మరింత బీభత్సంగా పడుతుంది. దీంతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావ కారణంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం అవుతుంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంటి నుంచి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా రోడ్లు..

Viral Video: బీభత్సం సృష్టించిన వర్షం.. రైళ్ల పట్టాలపై చేపలు..
Viral Video
Follow us

|

Updated on: Jul 10, 2024 | 7:24 PM

వర్షం కాలం మొదలైంది. కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే మరి కొన్ని ప్రాంతాల్లో వర్షం మరింత బీభత్సంగా పడుతుంది. దీంతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావ కారణంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం అవుతుంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇంటి నుంచి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా రోడ్లు.. కాలువలు, చెరువులను తలపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ముంబై రైల్వే కూడా నీటితో జలమయం అయ్యింది. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే ముంబై రైల్వే.. పట్టాలపై నీరు చేరడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రైల్వే స్టేషన్‌లలో ప్లాట్ ఫామ్‌లు రైటు పట్టాల్లో కూడా నీళ్లు చేరాయి. దీనికి సంబంధించే ఓ వీడియో వైరల్‌గా మారింద. ముంబైలో కురుస్తున్న వర్షాలకు.. రైలు పట్టాలపై కూడా నీటిని చేరడంతో.. చేపలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు.. చేపలు స్విమ్ చేస్తున్న సమయంలో సెల్ ‌ఫోన్లలో వీడియోలు తీసి షేర్ చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియోలు కాస్తా వైరల్‌గా మారాయి. సాధారణంగా వర్షాలు ఎక్కువగా పడితే రోడ్లపైకి చేపలు రావడం చూసాం. కానీ రైలు పట్టాలపై చేపలు రావడం చాలా అరుదు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.