Watch Video: పోలీసులకు చెప్పినా తగ్గేదేలే.. ఏసీ కోచ్‌లో సిగరెట్‌తాగుతూ రెచ్చిపోయిన యువతి.. చివరకు ఏమైందో చూడండి!
ట్రైన్‌లలో ఇటీవల యువత చేస్తున్న విచ్చలవిడి చేష్టలకు అడ్డూఅదుపులేకుండా పోతుంది. పక్కలో ప్రయాణికులు ఉన్నారన్నా ఇంగిత్త జ్ఞానం లేకుండా తమ ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలానే ఒక యువతీ రన్నింగ్ ట్రైన్‌లో, అది కూడా ఏసీ కోచ్‌లో సిగరెట్ తాగుతూ పట్టుపడింది. అదేంటని ప్రశ్నించిన తోటి ప్రయాణికులపై విరుచుకుపడింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రైన్‌లలో ఇటీవల యువత చేస్తున్న విచ్చలవిడి చేష్టలకు అడ్డూఅదుపులేకుండా పోతుంది. పక్కలో ప్రయాణికులు ఉన్నారన్నా ఇంగిత్త జ్ఞానం లేకుండా తమ ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు. రూల్స్ అతిక్రమించి రన్నింగ్ ట్రైన్ రీల్స్ చేయడం, రోమాన్స్ చేయడం వంటి నూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఇలానే ఒక యువతి రన్నింగ్ ట్రైన్‌లో, అది కూడా ఏసీ కోచ్‌లో సిగరెట్ తాగుతూ పట్టుపడింది. అదేంటని ప్రశ్నించిన తోటి ప్రయాణికులపై విరుచుకుపడింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకరాం.. ఒక యువతీ ఏసీ కోచ్‌లో సిగరెట్ తాగుతుండడం గమనించిన ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నించాడు. ఇది ఏసీ కోచ్ ఇక్కడ సిగరేట్ తాగరాదని నీకు తెలియదా.. బయటకు వెళ్లి సిగరెట్ కాల్చండి అని ఆమెపై సిరియస్ అయ్యాడు. అలానే ఆమె సిగరెట్ తాగుతున్న దృశ్యాలను వీడియో తీశాడు.
దీంతో రెచ్చిపోయిన యువతిపై అతడిపైనే రివర్స్ అయింది. ట్రైన్ ఏమన్నా నీదనుకుంటున్నావా.. లేదా నీ డబ్బుతో ఏమైనా నేను సిగరెట్ కాలుస్తున్నానా? అంటూ ఆ వ్యక్తితో గొడవకు దిగింది. పోలీసులకు చెప్పాలనుకుంటే వెళ్లి చెప్పుకో అంటూ వాధించింది. ఈ తతంగాన్నంత అక్కడే ఉన్న మరికొందరు ప్రయాణికులు ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు యువతి తీరుపై మండిపడుతున్నారు.
వీడియో చూడండి..
सार्वजनिक जगहों पर धूम्रपान करना दूसरों के अधिकारों का हनन है। ट्रेन जैसी जगह पर ऐसी हरकतें बिल्कुल बर्दाश्त नहीं होनी चाहिए। @RailMinIndia को जुर्माना और सख्त सजा दोनों देनी चाहिए। #IndianRailways #TrainMeNoSmoking #RailSafetyFirst pic.twitter.com/jmLEoPLInb
— Manjul Khattar 🇮🇳 (@manjul_k1) September 15, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
