Viral Video: తనను వేటాడాలనుకున్న పులిని చిన్న ట్రిక్ తో బోల్తా కొట్టించిన బాతు.. వీడియోకి 2 కోట్ల వ్యూస్ సొంతం
అడవిలో సింహం, చిరుతపులి లేదా పులి ఇతర జంతువులపై దాడి చేసి తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ప్రత్యేకించి మనం పులి గురించి మాట్లాడుకున్నట్లు అయితే అది తన ఎరకు తప్పించుకోవడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వదు. అయితే ఒక చిన్న బాతు .. పులి ఎరగా చిక్కితే జరుగుతుంది. క్షణాల్లో దానికి ఆహారంగా మారుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక పులి నుంచి చిన్న బాతు చాలా సులభంగా తప్పించుకుంది
ప్రకృతిలో ప్రతి జీవికి కొన్ని ఆహార నియమాలున్నాయి. అడవిలో నివసించే రకరకాల జంతువులు విభిన్న ఆహారపు అలవాట్లను కలిగి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అడవిని నిశితంగా పరిశీలిస్తే ఇక్కడ ఒక్కో జంతువు వేట ఒక్కో పద్ధతిలో ఉంటుంది. మాంసాహార జంతువులైన సింహం, పులి, వంటివి తమ ఆహారం కోసం వేటాడే విధానం వేరుగా ఉంటుంది. తాము వేటాడాలనుకున్న జంతువుల వెనుక మాటు వేసి దాడి చేస్తాయి. మరికొన్ని జంతువులు ముందు నుండి దాడి చేస్తాయి. దీంతో అడవిలో జీవించడానికి , పరిపాలించేది శక్తివంతమైన జంతువులు మాత్రమే అనే నియమం ఉంది. అయితే ఇలాంటి జంతువుల నుంచి కూడా తమ ప్రాణాలను తెలివి తేటలతో తప్పించుకునే చిన్న చిన్న జంతువులున్నాయి. ప్రస్తుతం నెట్టింట్లో అలాంటి వీడియో వైరల్ అవుతోంది.
అడవిలో సింహం, చిరుతపులి లేదా పులి ఇతర జంతువులపై దాడి చేసి తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ప్రత్యేకించి మనం పులి గురించి మాట్లాడుకున్నట్లు అయితే అది తన ఎరకు తప్పించుకోవడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వదు. అయితే ఒక చిన్న బాతు .. పులి ఎరగా చిక్కితే జరుగుతుంది. క్షణాల్లో దానికి ఆహారంగా మారుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక పులి నుంచి చిన్న బాతు చాలా సులభంగా తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రజలలో చర్చలో ఉంది.
ఇక్కడ వీడియో చూడండి
Smart duck.. pic.twitter.com/XVCNdpKKDA
— Buitengebieden (@buitengebieden) January 20, 2024
వైరల్ అవుతున్న వీడియో జూలో ఉన్న ఒక చెరువుకు సంబంధించినది. ఇక్కడ చెరువులో హాయిగా ఈదుతున్న బాతుని చూసి వేటాడాలనే ఉద్దేశ్యంతో పులి చడి చప్పుడు కాకుండా నీటిలోకి ప్రవేశించింది. అయితే పులి తన వెంట పడుతుందని బాతు గమనించింది. తనపై పులి దూసుకోస్తున్న విషయాన్ని గమనించిన బాతు కన్ను మూసి తెరచేలోగా నీటిలో మునిగిపోయి పులికి జలక్ ఇచ్చింది. బాతు నీటిలో మునిగి పులి కనుల ముందునుంచి అదృశ్యమయింది. పులి అయోమయంలో చూడడం కనిపించింది.
ఈ క్లిప్ @buitengebieden ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. దీనిని రెండు కోట్ల మందికి పైగా చూశారు. చిన్నదైనా గట్టిదే బాతు అంటూ దాని తెలివి తేటలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి.. బాతులు నీటిలో ఈదుతున్న సమయంలో ఎప్పటికప్పుడు ఒక ప్రక్రియను చేస్తాయి. దీనిని ప్రీనింగ్ అంటారు. ఇలా చేయడం వలన బాతు ఈకలు పొడిగా ఉంటాయి. ఈ సమయంలో, బాతు శరీరం నుండి నూనె బయటకు వస్తుంది. ఈకలను మృదువుగా చేస్తుంది. దీని కారణంగా బాతు నీటిలో ఉన్నా తడిగా ఉండదు. మునిగిపోదు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..