Viral Video: దొంగల సూపర్ ట్యాలెంట్.. సెకన్లలో షెట్టర్ లూటీ.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..!
Viral Video: సాధారణంగా దొంగలకు భయం వంటి ఆలోచనలు కొంతైనా ఉండవంటారు. ఒకసారి దోచుకోవాలని ఫిక్స్ అయితే.. ఆ పని పూర్తి అయ్యే వరకు..
Viral Video: సాధారణంగా దొంగలకు భయం వంటి ఆలోచనలు కొంతైనా ఉండవంటారు. ఒకసారి దోచుకోవాలని ఫిక్స్ అయితే.. ఆ పని పూర్తి అయ్యే వరకు తమ తెలివినంతా ఉపయోగించి శ్రమిస్తారు. దోచుకోవడానికి ఏ స్థాయి వరకైనా వెళ్తారు. వన్స్ రంగంలోకి దిగాక.. ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించికుని చోరీలకు పాల్పడుతారు. తాజాగా ఓ దోపిడీకి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో దోపిడి దొంగలు చేసిన పనిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ఇంత తెలివిగా ఎలా దోపిడీ చేస్తారంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోలో ఓ నలుగురు దొంగలు దుకాణాల సముదాయంలో దోపిడీకి వచ్చారు. ఒక షెట్టర్‌ను సెలక్ట్ చేసుకున్నారు. దానికి తాళం వేసి ఉన్నప్పటికీ అదేది వారికి అడ్డుకాలేదు. చాలా తెలివిగా ఒక టవల్‌తో షెట్టర్‌ను సునాయాసంగా ఓపెన్ చేశారు. ఆ తరువాత ఇద్దరు దొంగలు షాపు లోపలికి దూరారు. మరో ఇద్దరు బయట కాపలాగా నిల్చున్నారు. లాకర్ ఓపెన్ చేసే టైమ్ లేకనో ఏమో గానీ.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. అయితే, ఈ షాకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ‘గిడ్డే’ పేరుతో ఉన్న ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వారి టెక్నిక్‌కు నోరెళ్లబెడుతున్నారు. ఈ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
Also read:
Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!
Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..