Swiggy Delivery: భారీ వర్షంలో గుర్రంపై ఆర్డర్లు డెలివరీ.. స్విగ్గీ బాయ్‌ ఐడియా అదుర్స్‌.. నెటిజన్లు ఫిదా

|

Jul 06, 2022 | 1:17 PM

అయితే వర్షంలో సమయానికి ఆహారం అందజేయలేక ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ డెలీవరి బాయ్స్‌. దాంతో ఓ డిఫరెంట్‌ ఐడియా చేశాడు స్విగ్గీ ఫుడ్‌ డెలీవరిబాయ్‌...ఇక్కడ ఒక

Swiggy Delivery: భారీ వర్షంలో గుర్రంపై ఆర్డర్లు డెలివరీ.. స్విగ్గీ బాయ్‌ ఐడియా అదుర్స్‌.. నెటిజన్లు ఫిదా
Swiggy Food Delivery
Follow us on

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి, అనేక రాష్ట్రాలు వరదలను (ముంబయి వరద) చవిచూశాయి. బయట వర్షం కురుస్తున్నప్పుడు వేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. దాంతో కొందరు ఇంట్లోనే ఏ మిర్చిలో, బొండాలో చేసుకుంటే..మరికొందరు ఏంచక్కా మొబైల్ తీసి Swiggy లేదా Zomato నుండి మనకు కావలసిన ఆహారాన్ని ఆర్డర్ చేస్తారు..అయితే వర్షంలో సమయానికి ఆహారం అందజేయలేక ఇబ్బందులు పడుతున్నారు ఫుడ్ డెలీవరి బాయ్స్‌. దాంతో ఓ డిఫరెంట్‌ ఐడియా చేశాడు స్విగ్గీ ఫుడ్‌ డెలీవరిబాయ్‌…ఇక్కడ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ భారీ వర్షం కురుస్తుండటంతో బైక్‌పై కాకుండా గుర్రపు స్వారీ చేస్తూ తన కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేశాడు.

ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు యువకుడి కమిట్‌మెంట్‌ను అభినందిస్తున్నారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీని కారణంగా, స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ నడపలేకపోయాడు. కానీ ఆహారాన్ని డెలివరీ చేయడానికి గుర్రంపై బయల్దేరాడు.

ఇవి కూడా చదవండి

వీడియోలో, స్విగ్గీ డెలివరీ బాయ్ వర్షంలో ప్రధాన రహదారి వెంబడి తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు చూడవచ్చు. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. గుర్రపు స్వారీ ఉత్తమమని పలువురు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. గత మార్చిలో ఓ యువకుడు కూడా తన బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో అర్ధరాత్రి మార్గమధ్యలో చిక్కుకుపోయాడు. అప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్ తన బైక్‌లోని పెట్రోల్‌ను ఇచ్చి అతనికి సహాయం చేశాడు. దీంతో అప్పట్లో ఆ వీడియో కూడా వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి