Viral Video: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు నాలుగో రోజుకు చేరుకుంది. ఉత్సవాల్లో మూడో రోజు యాగశాలలో లక్ష్మీనారాయణ యాగం, లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. ఈ మహాయాగం ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. చినజీయర్ స్వామితోపాటు ఏడుగురు జీయర్ స్వాముల సమక్షంలో పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఉత్సవ విగ్రహాలకు సంబంధించిన శఠగోపం వీడియో వైరల్ అవుతోంది.
ఉత్సవాల్లో భాగంగా నేడు యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణేష్టి, సత్సంతానానికై వైనేతేయేష్టి, శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజలు జరుగనున్నాయి. కార్యక్రమంలో ప్రధానఘట్టం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. నేడు సాయంత్రం ముచ్చింతల్ చేరుకోనున్న ప్రధాని మోదీ.. 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహం జాతికి అంకితం ఇవ్వనున్నారు. అయితే శ్రీమత్ రామానుజాచార్యుల వారి సువర్ణ విగ్రహ పూజా నిమిత్తము తయారు చేసిన శఠారి (శఠగోపం). ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవముతో వినియోగంలోకి వస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన శఠగోపం వీడియో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి: