Viral Video: ఈ మేక చెవులు ‘కేక’.. చాన్తాడంత పొడవు చెవులతో సెలబ్రెటీ హోదా.. వీడియో వైరల్..

|

Jun 20, 2022 | 5:26 PM

సింబాతో యజమాని ప్రత్యేక బంధాన్ని కలిగి ఉన్నాడు. దీనితో తానే చంటి పిల్లాడిగా ఆడుతున్నాడు. సింబాకు పాల సీసాతో పాలు పట్టిస్తూ.. ఆకలి తీరుస్తూ.. తాను సంతోష పడుతున్నాడు. ఈ ఇద్దరి బంధం ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది.

Viral Video: ఈ మేక చెవులు కేక.. చాన్తాడంత పొడవు చెవులతో సెలబ్రెటీ హోదా.. వీడియో వైరల్..
Baby Goat Simba
Follow us on

Viral Video: సాధారణంగా పెద్ద పెద్ద చెవులు ఉండే జంతువు అంటే టక్కున గుర్తొచ్చది ఏనుగు. అందుకే ఎవరికైనా కొంచెం పెద్ద చెవులు ఉంటే ఏనుగు చెవులురా వీడివి అంటుంటారు. అయితే ఇక్కడ ఒక మేక చెవుల విషయంలో ఏనుగుతోనే పోటీ పడుతోంది. అవును. ఈ బుజ్జి మేక పిల్ల చెవులు చేటల్లా లేకున్నా.. చాంతాడంత పొడుగు మాత్రం ఉన్నాయి.

పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ రైతు ఇంట్లో జన్మించిన మేకపిల్ల పుట్టింది. అది పుట్టినప్పుడు దాని చెవులు చూసి ఆ రైతు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ మేకపిల్లకంటే దాని చెవులే పెద్దగా ఉన్నాయట. ఎంతంటే.. ఏకంగా 19 అంగుళాల పొడవున్నాయట. దీనికి ‘సింబా’అని పేరుపెట్టారు దాని యజమాని మహమ్మద్‌ హాసన్‌. సింబా మేక  అంటే స్వాహిలిలో సింహం అని అర్ధం. రెండు వారల క్రితం జన్మించిన ఈ మేక తన చెవులతో ఇప్పటికే స్థానికంగా సెలబ్రెటీగా మారింది.

ఇవి కూడా చదవండి

పొడవైన చెవులు కలిగిన ఈ మేక పిల్ల త్వరలోనే గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కబోతోందట. ఈ మేకపిల్ల ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ తెగ సంబరపడిపోతున్నాడు హాసన్‌. సాధారణంగా నుబియన్‌ జాతికి చెందిన మేకల చెవులు పొడుగ్గా ఉంటాయట.. కానీ ‘సింబా’చెవులు అంతకంటే పొడవుగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఈ మేక పిల్ల చెవులు ఇంత పొడవు పెరగడానికి జన్యు మార్పిడిగానీ, ఏదైనా జెనెటిక్‌ సమస్యగానీ కారణం అయి వుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

సింబాతో యజమాని ప్రత్యేక బంధాన్ని కలిగి ఉన్నాడు. దీనితో తానే చంటి పిల్లాడిగా ఆడుతున్నాడు.  సింబాకు  పాల సీసాతో పాలు పట్టిస్తూ.. ఆకలి తీరుస్తూ.. తాను సంతోష పడుతున్నాడు. ఈ ఇద్దరి బంధం ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..