Viral Video: ఇదేం పిచ్చి తల్లీ.. వరదల్లో మునిగిపోతున్నా సెల్ఫీ తీసుకుంటున్న మహిళ.. వైరల్ వీడియో

వైరల్ అవుతున్న వీడియోలో, వరద నీటిలో ఒక మహిళ సెల్ఫీ స్టిక్‌తో వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.  వరద నీరు మహిళ వైపు వేగంగా వస్తుంది.. ఆ వరద వేగానికి దూరంగా వెళ్తూ.. సెల్ఫీతో వరదని చిత్రీ కరించడానికి ప్రయత్నిస్తూనే ఉంది..

Viral Video: ఇదేం పిచ్చి తల్లీ.. వరదల్లో మునిగిపోతున్నా సెల్ఫీ తీసుకుంటున్న మహిళ.. వైరల్ వీడియో
Floods Selphi Video

Edited By:

Updated on: Jul 13, 2022 | 1:47 PM

Viral Video: సందర్భానుసారంగా కొన్ని పాత వీడియోలను వెలికి తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు నెటిజన్లు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా భారీ వర్షాలు, వరదలు.. ఈ సందర్భమది ఓ మహిళకు చెందిన పాత వీడియో షేర్ చేస్తున్నారు.. నెటిజన్లు ఈ వీడియోకి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కొంతమంది సోషల్ మీడియాలో సందడి చేయడానికి  తమ వీడియోలకు, ఫోటోలకు లైక్‌లు వ్యూస్ ను పొందడానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అటువంటిదే. ఈ క్లిప్‌లో భారీ వరద ఓ గ్రామం వైపు వేగంగా వెళ్తోంది. ఈ ప్రమాదకరమైన సమయంలో కూడా ఓ మహిళ సెల్ఫీ తీసుకుంటుంది.. అంతేకాదు ఈ వీడియోలో, మహిళ మెడ వరకు వరద నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ, ఆమె భయపడకుండా సెల్ఫీ స్టిక్‌తో వీడియోలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, వరద నీటిలో ఒక మహిళ సెల్ఫీ స్టిక్‌తో వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.  వరద నీరు మహిళ వైపు వేగంగా వస్తుంది.. ఆ వరద వేగానికి దూరంగా వెళ్తూ.. సెల్ఫీతో వరదని చిత్రీ కరించడానికి ప్రయత్నిస్తూనే ఉంది.. చివరికి వరద నీరు ఆ  మహిళని ముంచెత్తింది..  దాదాపు వరద నీటిలో ఆ మహిళ మునిగిపోయింది కూడా.. అయితే ఇంత జరిగినా ఆ మహిళ సెల్ఫీ స్టిక్ వదలకపోవడం ఆశ్చర్యకరం. మెడ వరకు నీళ్లలో మునిగిపోయిన తర్వాత కూడా ఆ మహిళ వీడియోలు చేస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఫిగెన్ అనే ఖాతాతో షేర్ చేయబడింది.  ‘వరదల సమయంలో మొదటి సెల్ఫీ స్టిక్ తో వీడియో తీయాలన క్యాప్షన్ జత చేశారు. ఒక రోజు క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల 68 వేలకు పైగా వీక్షించారు. ఈ పోస్ట్‌ను 15 వేల మందికి పైగా లైక్ చేయగా, 3 వేల మందికి పైగా వినియోగదారులు రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తునే ఉన్నారు. ఈ వీడియో ఇండోనేషియాకు చెందినదని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు ఇది చాలా పాత వీడియో అని.. ఓ సారి అక్కడ సునామీ హెచ్చరిక జారీ చేశారు. అది పట్టించుకోకుండా కొంతమంది  వరద వస్తున్న సందర్భమది వీడియోలు చేయడం ప్రారంభించారు. అందులో భాగమే ఈ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక వినియోగదారు ఆ మహిళ వరదల సెల్ఫీపై  స్పందిస్తూ.. ప్రపంచంలో ఇడియట్స్ కొరత లేదని వ్యాఖ్యానించారు. మహిళ సెల్ఫి పిచ్చిని తిడుతూ.. ముందు ప్రాణాలు ముఖ్యం.. తర్వాత వీడియో  అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us