Crow Ramp Walk: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలను చూడడానికి నెటిజన్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు వాటిని తమ ఫ్రెండ్స్‌తో వెంటనే షేర్ చేసుకుంటారు. అందుకే ఇవి క్షణాల్లోనే వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు అలాంటి కాకి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారందరూ పడిపడి నవ్వుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. సాధారణంగా మనం క్యాట్ వాక్ లేదా ర్యాంప్‌లో నడిచే మోడల్స్‌ను మాత్రమే చూసి ఉంటాం. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు కూడా. అయితే ఇక్కడ ఓ కాకి ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే మోడల్‌గా మారింది. ఓ పిట్టగోడపై క్యాట్‌వాక్‌తో అదరగొట్టింది.
ఈ వీడియోను @Gabriele_Corno అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 7.5 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే వేలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ‘మిస్ బ్లాక్ బ్యూటీ క్యాట్ వాక్’, ‘నీ స్టైల్, యాటిట్యూడ్, వాకింగ్ స్టైల్ సూపర్బ్’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ కాకి ర్యాంప్‌వాక్ వీడియోపై ఓ లుక్కేయండి.
Fashion show pic.twitter.com/v7ywJJ2dha
— Gabriele Corno (@Gabriele_Corno) August 23, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..