Viral Video: మీకూ.. ఇలాంటి ఫ్రెండ్ ఉండే ఉంటాడు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో..

Penguins Funny Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజగా వైరల్ అవుతున్న

Viral Video: మీకూ.. ఇలాంటి ఫ్రెండ్ ఉండే ఉంటాడు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో..
Viral Video
Follow us

|

Updated on: Dec 20, 2021 | 12:50 PM

Penguins Funny Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజగా వైరల్ అవుతున్న వీడియో ఎందరో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వాస్తవానికి సరదాగా గడపడం అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. మనుషులైనా, జంతువులైనా.. సరదాగా గడిపే అవకాశం దొరికినప్పుడల్లా విపరీతంగా ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా.. పెంగ్విన్‌లకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూస్తే మీరు కూడా మీ సరదా రోజులను ఖచ్చితంగా గుర్తుకుతెచ్చుకుంటారు. పెంగ్విన్‌లకు సంబంధించిన ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు తెగ ఇష్టపడుతున్నారు. ఇందులో మంచుకొండపై నిలబడి ఉన్న పెంగ్విన్ సముద్రం వైపు చూస్తుండగా.. దాని మరో ఫ్రెండ్.. ఆ పెంగ్విన్‌ను నీటిలోకి నెడుతుంది.

ఈ వైరల్ వీడియోలో సముద్రం మధ్యలో గడ్డకట్టిన మంచుగడ్డ మీద ఒక పెంగ్విన్ నిలబడి సముద్రం వైపు చూస్తుంటుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా దాని స్నేహితులలో ఒకటైన మరో పెంగ్విన్ దానిని నీటిలోకి నెట్టడాన్ని చూడవచ్చు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని.. ఇది చిన్ననాటి రోజులను గుర్తుచేస్తుందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను చూడండి..

వైరల్ వీడియో..

ఈ వైరల్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను పంచుకుంటూ.. సుశాంత్ నందా క్యాప్షన్ కూడా రాశారు. మనందరికీ పాఠశాలలో ఇలాంటి స్నేహితుడు కచ్చితంగా ఉంటాడని పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది నెటిజన్లు వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత తమ చిన్ననాటి తీపి గుర్తులు యాదికి వస్తున్నాయంటూ.. నవ్వుకుంటారు. పాఠశాలలో మాత్రమే కాదు.. ఎక్కడైనా ఇలాంటి వ్యక్తులు ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Sore Throat Home Remedies: గొంతు నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి చాలు..

Omega 3 Fatty Acids: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో ఆ సమస్యలు మటుమాయం.. ప్రయోజనాలు తెలిస్తే షాకే..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?